జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. శ్రీనగర్‌లోని పరీం పొరా ప్రాంతం వద్ద భద్రతబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. తొలుత ముష్కరులు సైన్యంపై దాడులకు పాల్పడగా భారత సైనికులు దీటుగా తిప్పికొట్టారు.
ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ భారత సీఆర్పీఎఫ్ జవానూ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఉగ్రవాదినీ ప్రాణాలతో పట్టుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: 200 అడుగుల హైవోల్టేజ్ టవర్‌పైనుంచి జంప్!