జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడిని భగ్నం చేశాయి భద్రతా బలగాలు. ముందే సమాచారం అందుకున్న సిబ్బంది.. జైషే ముస్తాఫా ఉగ్ర ముఠాకు చెందిన ఇద్దరు ముష్కరులను అరెస్టు చేశారు. అనంతరం.. మరో నలుగురు ఉగ్ర అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
జైషే మహ్మద్‌కు అనుబంధంగా పనిచేసే ఉగ్రముఠా జైషే ముస్తాఫా.. దక్షిణ కశ్మీర్లో ఉగ్ర దాడికి ప్రణాళికలు రచించినట్లు పోలీసులకు సమాచారం అందింది. భద్రతా బలగాలతో కలిసి.. నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దొనిపురా వద్ద ఆల్టో కారులో వచ్చిన ఇద్దరు ముష్కరులు.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ దొరికిపోయారు.
ఇద్దరినీ అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రెండు పిస్టోళ్లు, 116 బుల్లెట్లు, ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం.. మరో నలుగురు అనుచరులను అరెస్టు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: చైనాకు చెక్ పెట్టేందుకు ఆర్మీకి 'టిబెట్' పాఠాలు