ETV Bharat / bharat

హిజ్బుల్​కు మరో దెబ్బ - హిజ్బుల్​ ముజాహిదీన్​

జమ్ముకశ్మీర్​లోని త్రాల్​లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతాదళాలు ఇద్దరు స్థానిక హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రవాదులను హతమార్చాయి.

జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్​ ఉగ్రవాదులు హతం
author img

By

Published : Mar 5, 2019, 3:34 PM IST

జమ్ముకశ్మీర్​ త్రాల్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. వీరు స్థానిక 'హిజ్బుల్​ ముజాహిదీన్​' ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు.

పుల్వామా జిల్లా త్రాల్​లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో సోమవారం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతాబలగాలు సైతం దీటుగా స్పందించాయి.

12 గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరిని గుల్షన్​పురాకు చెందిన అద్ఫర్​ ఫయాజ్ పెర్యాయ్​, షరైఫాబాద్​కు చెందిన ఇర్ఫాన్​ అహ్మద్​ రాథర్​గా గుర్తించారు. ఎదురుకాల్పుల సమయంలో ఒక స్థానికుడికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

భద్రతాదళాలు ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాయి.

పాక్​ పైశాచికత్వం

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ పరిసర ప్రాంతాలపై​ కాల్పులకు పాల్పడుతోంది. మోటార్​ షెల్స్​ను, చిన్నపాటి ఆయుధాలను ప్రయోగిస్తోంది. భారత రక్షణ దళాలు దీటుగా స్పందిస్తున్నాయి.

పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైష్​ ఉగ్రవాద స్థావరాలపై భారత్​ దాడి చేసినప్పటి నుంచి పాక్​ నిరంతరాయంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడుతోంది. పాక్​ పైశాచికత్వానికి గత వారం రోజుల్లో సుమారు నలుగురు వ్యక్తులు మరణించగా, 60 మంది పౌరులు గాయపడ్డారు.

Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.