ఎక్కడైనా అమ్మాయి- అబ్బాయి వివాహమాడతారు. అయితే అసాధారణంగా ఇద్దరు అమ్మాయిలు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా రాజా తలాబ్ ప్రాంతంలో ఓ హనుమంతుడి గుడి వేదికైంది. బుధవారం జరిగిన ఈ తతంగం కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
కాన్పుర్కు చెందిన ఇద్దరు అమ్మాయిలు కళాశాల రోజుల నుంచి స్నేహితులు. కలిసే ఉండేవారు. అబ్బాయిలపై నమ్మకం లేక జీవితాంతం కలిసి ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారట. హిందూ సంప్రదాయం ప్రకారం వారికి పెళ్లి చేశారు స్థానికులు, ఆలయ పూజారి.
"ఇద్దరు అమ్మాయిలు మా దగ్గరకు వచ్చి మాకు పెళ్లి చేయండి అని అడిగారు. మేము నవ్వుతూ వరుడు ఎక్కడ అని అడిగాం. అబ్బాయిలు లేరు. మేమిద్దరమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఆని వాళ్లు బదులిచ్చారు. మేము స్నేహితులం. కలిసే ఉంటాం, కలిసే నిద్రపోతాం.. మాకు అబ్బాయిలపై విశ్వాసం లేదు. వాళ్లని నమ్మడానికి లేదన్నారు. వారి వెంట బంధువులు ఎవరూ రాలేదు. వాళ్లిద్దరే వచ్చారు."
-పాల్జీ, స్థానికుడు
- ఇదీ చూడండి: ఎట్టకేలకు గాడినపడ్డ వాట్సాప్, ఇన్స్టా