ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో మూడురోజుల్లో 3 ఏనుగులు మృతి - రెండు ఏనుగులు మృతి

దేశంలో రోజురోజుకు మూగజీవులపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కేరళలో రెండు ఏనుగుల మృతి.. జంతు ప్రేమికులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. ఇది మరువకముందే ఛత్తీస్​గఢ్​లో మూడు రోజుల వ్యవధిలోనే మరో 3 గజరాజుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

2 elephants found dead within two days in Chhattisgarh
ఛత్తీస్​గఢ్​- సూరజ్​పూర్​ అడవుల్లో చనిపోయిన ఏనుగు
author img

By

Published : Jun 11, 2020, 7:26 PM IST

కేరళలోని రెండు ఏనుగుల మృతి ఘటన మరువక ముందే వరుసగా గజరాజులు చనిపోతున్న వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్​గఢ్​లో మూడు రోజుల వ్యవధిలో 3 గజరాజుల మృత దేహాలు లభ్యమయ్యాయి.

ఛత్తీస్​గఢ్​- సూరజ్​పూర్​ అడవుల్లో చనిపోయిన ఏనుగు

గర్భంతో ఒకటి..!

బల్రాంపుర్​ జిల్లా రాజ్​పుర్​ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. అంతకుముందు జూన్​ 9, 10 తేదీల్లో వరుసగా రెండు గజరాజుల మృత దేహాలు సూరజ్​పుర్​ జిల్లాలోని ప్రతాప్​పుర్ అరణ్యంలో లభ్యమయ్యాయి. ఇందులో ఓ ఏనుగు గర్భంతో ఉంది. ఈ మూడూ ఆడ ఏనుగులుగా గుర్తించారు అటవీ శాఖ సిబ్బంది. పోస్ట్​మార్టం నివేదిక ప్రకారం మూడు ఏనుగులు సహజంగా మరణించలేదని.. విషపదార్థాలు తినడం వల్లే మృతి చెందాయని తెలిసింది. కేసు నమోదు చేసిన అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అటవీ ఏనుగుల మృతి ఘటనలపై కేంద్రం సీరియస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.