భారత్లోని 24లక్షలమంది చిన్నారులపై తాజా వరదలు ప్రభావం చూపించాయని యూనిసెఫ్ అంచనా వేసింది. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణమే సహాయం చేయాలని, ముప్పు ప్రాంతాల్లో పరిస్థితులను శాశ్వతంగా చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని సూచించింది.
భారత్లో ప్రతి ఏటా ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని.. కానీ జులైలో ఈ స్థాయిలో వరదలు బీభత్సం సృష్టించడం అసాధారణమని పేర్కొంది యూనిసెఫ్.
"భారత్లోని బిహార్, అసోం, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, బంగాల్ రాష్ట్రాల్లోని 60లక్షల మంది వరదల బీభత్సానికి ప్రభావితమయ్యారు. వీరిలో 24లక్షలమంది చిన్నారులు ఉన్నారు."
--- యూనిసెఫ్.
ఇదీ చూడండి:- ముంచుతున్న నిర్లక్ష్యం 'వరద'
కరోనా సంక్షోభం, కరోనా కట్టడికి విధించిన నిబంధనలకు వరదలు తోడవడం వల్ల పరిస్థితులు దారుణంగా మారాయని యూనిసెఫ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వరదల్లో సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని తక్షణమే రక్షించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు అనేక రాష్ట్రాల్లో చిన్నారుల అరోగ్య సేవలకు మద్దతిస్తున్నట్టు తెలిపింది.
ఇదీ చూడండి:- ఆపత్కాలంలో భారత్కు అండగా ఉంటాం: ఐరాస