ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో మరో అత్యాచార ఘటన - badhohi girl raped

ఉత్తర్​ప్రదేశ్​ భదోహీ జిల్లాలో 19 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. స్థానిక కార్పెట్​ ఫ్యాక్టరీ ఉద్యోగి.. బాధితురాలిపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

19-yr-old woman raped in UP's Bhadohi
యువతిపై కార్పెట్​ ఫ్యాక్టరీ ఉద్యోగి అత్యాచారం
author img

By

Published : Oct 12, 2020, 8:28 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భదోహీ జిల్లాలో 19ఏళ్ల యువతిపై స్థానిక కార్పెట్​ ఫ్యాక్టరీ ఉద్యోగి అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

గత శనివారం.. అస్వస్థతకు గురైన బాధితురాలని ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఈ విషయం బయటకు వచ్చింది. బాధితురాలు మూడు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధరించారు.

అసలు విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 22ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు తరలించినట్టు భదోహీ జిల్లా ఎస్పీ రామ్​ బదన్​ సింగ్​ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.

ఇదీ చదవండి :యూపీలో మరో ఘోరం- బాలికపై 12 మంది...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.