మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రరూపం దాల్చింది. తాజాగా రాజ్‌భవన్‌లోని 18 మందికి వైరస్ సోకింది. వారంతట వారే ముందుకొచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ విషయం బయటపడిందని ముంబయి కార్పొరేషన్ అధికార వర్గాలు తెలిపాయి. అయితే వీరికి మరోమారు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
గవర్నర్ హోం క్వారంటైన్...
ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. రాజ్‌భవన్‌లో జరగాల్సిన అన్ని సమావేశాలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇతరులను రాజ్‌భవన్‌లోకి అనుమతించకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు.
దేశంలో మహరాష్ట్ర.. కరోనా వైరస్ కేంద్రబిందువుగా మారింది. ఇప్పటివరకు 2,46,000కుపైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో 99,499 యాక్టివ్ కేసులు కాగా... 1,36,985 మంది వైరస్‌ను జయించారు. మొత్తం 10,116మంది వైరస్‌కు బలయ్యారు.