బిహార్లో భారీ వర్షాల కారణంగా.. మంగళవారం పలు చోట్ల పిడుగులు పడి 15 మంది మరణించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో.. వీలైనంత వరకు ప్రజలను బయటకు రావొద్దని కోరారు నితీశ్.
పిడుగుల ధాటికి బిహార్వ్యాప్తంగా నెలరోజుల వ్యవధిలో 180 మందికిపైగా చనిపోయారు. వీరిలో జూన్ 25 నాడే 83 మంది(23 జిల్లాల్లో) ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: నవంబర్ నాటికి ఆక్స్ఫర్డ్ టీకా.. ధరెంతంటే?