రాజస్థాన్ చురూ జిల్లా బియూబస్ గ్రామంలోని గోశాలలో మృతిచెందిన ఆవుల సంఖ్య పెరిగింది. ఆదివారం మరో 14 గోవులు మృత్యువాతపడ్డాయి. మొత్తం మృతిచెందిన ఆవుల సంఖ్య 94కు చేరింది. ఆవుల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
" విషపూరిత గ్రాసం తినటం వల్లే ఆవులు మృతిచెందాయా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. పశువులు తిన్న గ్రాసం నమూనాలను పరీక్షించడానికి ప్రయోగశాలకు పంపించాం."
-- కుతేంద్ర కన్వార్, సర్దార్శహర్ తహసీల్దార్
శనివారం 80 ఆవులు మృతిచెందాయి. విషపూరిత గ్రాసం తినటం వల్లే గోవులు మరణించి ఉంటాయని పశు వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు.
ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో 78 గోవులు మృతి.. కారణమిదే!