ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​ రోడ్డు ప్రమాదంలో 14కు చేరిన మృతులు - ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ప్రైవేటు బస్సు ఓ ట్రక్కును వెనక నుంచి ఢీ కొట్టిన ఈ ఘటనలో 31 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

14 dead and several injured in bus collied with truck in uttar pradesh's ferozabad
ప్రమాదం
author img

By

Published : Feb 13, 2020, 9:18 AM IST

Updated : Mar 1, 2020, 4:27 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఆగ్రా-లక్నో ఎక్స్​ప్రెస్​ హైవేపై దిల్లీ నుంచి మోతీహరి వెళ్తున్న ప్రైవేటు బస్సు... ఓ ట్రక్కును వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను ఇటావా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40-45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయ చర్యలకు అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం

Last Updated : Mar 1, 2020, 4:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.