దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. నేడు మరో 134 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబయిలో 113, రాయ్‌ఘడ్, అమ్రావతి, భీవండి, పింప్రి-చింద్వారాలో ఒక్కోకేసు, పుణెలో నాలుగు, మిరా భయాందర్‌లో 7, నావి ముంబయి, థానె, వాసాయ్ విరార్‌లో రెండు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1895కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పుణెలో ఈరోజు మరణించిన ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరికీ ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 127కు చేరింది.
ఇదీ చదవండి: లాక్డౌన్ పాస్ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత