పశ్చిమ బంగలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 13మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయ పడ్డారు.
కారు చెరువులో పడి...
పశ్చిమ బంగ దక్షిణ 24 పర్గనాస్ జిల్లాలో ఉదయం 6 గంటల సమయంలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో సహా మెుత్తం ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఖతర్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న బంధువుని కోల్కతా విమానాశ్రయం నుంచి తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది.
కారు, లారీ ఢీకొని...
పశ్చిమ బంగ బక్కార్పూర్ వద్ద 34వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన వారిలో ఇద్దరిని మాల్డా వైద్య కళాశాలకు తరలించారు. మరో ఆరుగురిని కోల్కతా ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారని స్థానిక ఎస్పీ ఆలోక్ రాజోరియా తెలిపారు. బాధితులు ఓ వివాహ వేడుకకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.