దక్షిణాది రాష్ట్రాల మండలి 11వ సమావేశం చెన్నైలో జరిగింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు సహా ఐదు దక్షిణాది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ పథకాలు, చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేయడం, అంతరాష్ట్ర నదీ జలాల ఫిర్యాదులపై చర్చించారు. మొత్తం 44 అంశాలు ఎజెండాలో చేర్చారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అమలు చేయాల్సిన అంశాలు, చేపట్టాల్సిన పనులు కూడా ఇందులో ఉన్నాయి.
ఇదీ చూడండి: 'పవార్‌పై కేసు... రాజకీయ అవకాశవాదమే'