ETV Bharat / bharat

చేపలు వలలోకి.. భద్రత గాలిలోకి..

భౌతిక దూరం నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ.. వందలాది మంది ఒక చోట గుమిగూడిన ఘటన తమిళనాడు అరియలూరులో జరిగింది. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. ప్రజలు మాత్రం తీవ్ర నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వైనాన్ని ఇది తేటతెల్లం చేస్తోంది.

Fish Festival
నక్కంబాడి చేపల పండుగ
author img

By

Published : Jun 4, 2020, 12:31 PM IST

ఓ వైపు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నా.. ప్రజలు తీవ్ర నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది తమిళనాడు అరియలూరులో జరిగిన 'చేపల పండుగ'.

చేపలు వలలోకి.. భద్రత గాలిలోకి..

అరియలూరు జిల్లాలోని నక్కంబాడి గ్రామంలో ఏటా 'చేపల పండుగ' ఘనంగా జరుపుకుంటారు. చుట్టు పక్కల గ్రామాల వారు కూడా ఈ వేడకల్లో పాల్గొంటారు. ప్రజలందరూ చెరువులోకి వెళ్లి చేపలు పట్టి చాలా సంతోషంగా పండుగ చేసుకుంటారు.

భౌతిక దూరానికి తిలోదకాలు..

కానీ ఈ ఏడాది కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల కారణంగా... ప్రజలు ఈ వేడుక జరుపుకోకూడదని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కానీ స్థానికులు ఈ మాటలు చెవిన పెట్టలేదు. కనీసం మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా.. వందలాది మంది ఒక్కచోట చేరి చేపల పండుగ జరుపుకున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి ప్రజలను అక్కడి నుంచి పంపించివేశారు.

ఇదీ చూడండి: 24 గంటల్లో మరో 9304 మందికి కరోనా.. 260 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.