ETV Bharat / bharat

బ్యాంకులో రూ.20 లక్షలు దోచేసిన పదేళ్ల బాలుడు - जींद बैंक में चोरी

హరియాణాలో పదేళ్ల బాలుడు బ్యాంకు చోరీకి పాల్పడ్డాడు. అమాయకంగా వచ్చి సిబ్బంది కళ్లుగప్పి ఎంతో నైపుణ్యంతో రూ. 20 లక్షలు దోచుకెళ్లాడు. ప్రస్తుతం ఆ బాలుడి జాడకోసం గాలిస్తున్నారు పోలీసులు.

10-year-old-child-steals-20-lakh-rupees-from-bank-in-jind-cctv-footage-captured
ఆ బాల దొంగ.. బ్యాంకులో రూ.20 లక్షలు దోచేశాడు!
author img

By

Published : Sep 29, 2020, 2:01 PM IST

హరియాణాలో ఓ బాలచోరుడు కలకలం రేపాడు. పట్టుమని పదేళ్లు నిండకుండానే ఓ జాతీయ బ్యాంకులోకి చొరబడి రూ. 20 లక్షలు కాజేశాడు.

బ్యాంకులో రూ.20 లక్షలు దోచేసిన బాలుడు

దర్జాగా స్కెచ్​

జింద్ జిల్లా, హుడా మార్కెట్​లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ప్రవేశించాడు ఓ పదేళ్ల బాలుడు. టోపీ, మాస్కు ధరించి క్యాష్ కౌంటర్ పక్కన ఏర్పాటు చేసిన ఓ కుర్చీలో కూర్చొని చోరీకి స్కెచ్ వేశాడు. సరాసరి క్యాష్​ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న రూ. 5 లక్షల కట్టలను చూశాడు. కూడా తెచ్చుకున్న సంచిలో ఓ నాలుగు కట్టలు వేసుకున్నాడు. ఎవ్వరికీ ఏమాత్రం అనుమానం రాకుండా నిదానంగా అక్కడి నుంచి జారుకున్నాడు.

ఆ సమయంలో చోరీ జరిగనట్టు ఎవరికీ ఇసుమంతైనా అనుమానం రాలేదు. కానీ, సాయంత్రం లెక్కల్లో తేడా కొట్టేసరికి.. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు సిబ్బంది. పదేళ్ల బాలుడు ఎంతో చాకచక్యంగా చోరీకి పాల్పడిన దృశ్యాలు చూసి ఖంగు తిన్నారు. ప్రస్తుతం, బాలుడు సహా ఈ చోరీతో సంబంధమున్న మరో ఇద్దరి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: గుండె భాష వినండి- ప్రమాదాన్ని ముందే పసిగట్టండి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.