ఝార్ఖండ్‌లోని రామ్‌గర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వలస కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి ఒకరు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. గుజరాత్ నుంచి పశ్చిమ బంగా రాష్ట్రానికి వెళ్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.
రాజరప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని కెంజియా లోయలో బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.