ETV Bharat / bharat

Bharat Drone Shakti 2023 Exhibition : వాయుసేనలోకి పవర్​ఫుల్ విమానం. ఎమర్జెన్సీ సమయంలో సైనికుల తరలింపు మరింత ఈజీ!

Bharat Drone Shakti 2023 Exhibition : సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానం.. భారత వైమానిక దళంలో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో ఈ విమానాన్ని వాయుసేనలో ప్రవేశపెట్టారు. ప్రత్యేక మిషన్లు చేపట్టడం సహా విపత్తు సమయాల్లోనూ, సముద్ర గస్తీలోనూ ఈ రవాణా విమానం ఎంతగానో ఉపయోగపడనుంది. 5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌ 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. భారీ విమానాలు చేరుకోలేని ప్రదేశాలకు సైతం లాజిస్టిక్ కార్యకలాపాలు సాగించగలదు.

Bharat Drone Shakti 2023 Exhibition
Bharat Drone Shakti 2023 Exhibition
author img

By PTI

Published : Sep 25, 2023, 1:55 PM IST

Updated : Sep 25, 2023, 2:25 PM IST

Bharat Drone Shakti 2023 Exhibition : స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ సంస్థ తయారు చేసిన సీ295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని ఆధునికీకరించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం 21 వేల 935 కోట్లతో 56 సీ-295 రవాణా విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. అందులో భాగంగా తయారైన తొలి విమానం ఇప్పుడు భారత వైమానిక దళంలో చేరింది. ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో అధికారికంగా భారత వాయుసేనలోకి దీన్ని ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హ్యాంగర్‌ వద్ద సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.

  • #WATCH | Defence Minister Rajnath Singh inside C-295 MW transport aircraft following the aircraft's formal induction into Indian Air Force at Hindon Airbase in Ghaziabad pic.twitter.com/DjegIyUsxw

    — ANI (@ANI) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఒప్పందంలో భాగంగా 2025 నాటికి.. ఫ్లై అవే కండీషన్‌లో ఉన్న 16 విమానాలను ఎయిర్‌ బస్‌ డెలివరీ చేయనుంది. మిగిలిన 40 విమానాల అమరిక, తయారీ భారత్‌లోని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌లో జరుగుతుంది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య ఒప్పందం ఖరారైంది. గతేడాది అక్టోబరులో వడోదరలో సీ-295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ప్రైవేట్‌ కన్సార్టియం ద్వారా తయారయ్యే మొదటి సైనిక విమానం ఇది. భారత వైమానిక దళంలో ఆరు దశాబ్దాల కిందట అవ్రో-748 విమానాలను ప్రవేశపెట్టారు. వాటిని సీ-295 విమానాలతో భర్తీ చేయనున్నారు.

  • #WATCH | A compact system of drone that can be carried on a motorbike displayed during Bharat Drone Shakti-2023 at the Hindon Air Base in Uttar Pradesh's Ghaziabad.

    Special motorbikes are customised to carry unassembled drones. Kisan drones can be transported using motorbikes… pic.twitter.com/Zc5GFvvPg4

5 నుంచి 10 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌ 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్లను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న భారీ విమానాలు చేరుకోలేని ప్రదేశాలకు సైతం లాజిస్టిక్ కార్యకలాపాలు సాగించగలదు. ఈ విమానం ప్రత్యేక మిషన్లతోపాటు విపత్తు ప్రతిస్పందన, సముద్ర గస్తీ విధులను నిర్వహించగలదు. భారత వైమానిక దళానికి చెందిన ఆరుగురు పైలట్లు, 20 మంది సాంకేతిక నిపుణులు ఇప్పటికే సివిల్లెలో ఈ విమానం నడిపేందుకు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

కాగా.. భారత వాయుసేన, డ్రోన్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన.. భారత్ డ్రోన్ శక్తి-2023 ప్రదర్శనను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొన్ని డ్రోన్ల విన్యాసాలను రాజ్‌నాథ్ సింగ్, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ కలిసి వీక్షించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా పరిశీలించారు. 50 నుంచి 100 కిలోల బరువైన పేలోడ్లను మోసుకుని వెళ్లే డ్రోన్లను రక్షణమంత్రి, వాయుసేన అధిపతి పరిశీలించారు. శత్రువులపై దాడులు చేయగల కమికజే సైనిక డ్రోన్లను పనితీరును సైతం వీక్షించారు. అలాగే మోటార్​ బైక్​లపై నుంచి కిసాన్ డ్రోన్​లను ఆపరేట్ చేయడాన్ని రాజ్​నాథ్​ సింగ్ పరిశీలించారు.

  • #WATCH | Defence Minister Rajnath Singh and IAF Chief Air Chief Marshal VR Chaudhari witness drones with the capability to carry 50kg-100 kg payload during Bharat Drone Shakti-2023 at Hindon Airbase in Ghaziabad pic.twitter.com/PDnLKJbUcF

C295 Military Transport Aircraft : భారత​ గడ్డపైకి తొలి C-295 జెట్.. ఎయిర్​ఫోర్స్​లోకి అప్పుడే చేరిక

'సైన్యానికి కొత్త శక్తి'.. సీ295 విమానాల తయారీ కేంద్రానికి మోదీ శంకుస్థాపన

Last Updated : Sep 25, 2023, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.