ETV Bharat / bharat

మోదీకి కొవాగ్జిన్ టీకాపై భారత్​ బయోటెక్ హర్షం - మోదీ సంకల్పంపై భారత్​ బయోటెక్ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యాక్సినేషన్​ కోసం​ కొవాగ్జిన్ వినియోగించడంపై భారత్​ బయోటెక్ ఆనందం వ్యక్తం చేసింది. ఆత్మనిర్భర్​ భారత్​ నిర్మాణం కోసం మోదీ సంకల్పం ఆదర్శనీయమని పేర్కొంది.

Bharat Biotech on PM Modi
మోదీ సంకల్పంపై భారత్​ బయోటెక్ హర్షం
author img

By

Published : Mar 1, 2021, 1:51 PM IST

ఆత్మనిర్భర్​ భారత్ నిర్మాణం​ కోసం ప్రధాని నిబద్ధత ఆదర్శప్రాయమని భారత్ బయోటెక్ కొనియాడింది. మనమంతా కలిసి కొవిడ్-19పై పోరాటం చేసి విజయం సాధించాలని పేర్కొంది. దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను నరేంద్ర మోదీ తీసుకోవడంపై ఈమేరకు స్పందించింది.

ఉదయాన్నే ఎయిమ్స్​కు వెళ్లి..

మోదీకి ఎయిమ్స్‌ సిస్టర్‌ పి.నివేదా టీకా ఇచ్చారు. టీకా తీసుకున్న సమయంలో అసోంలో తయారు చేసిన గమ్చా(కండువా)ను ధరించి మోదీ కనిపించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయన ఈ వస్త్రాన్ని ధరించారు. గతంలోనూ చాలా సందర్భాల్లో మోదీ దీన్ని ధరించడం విశేషం. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి కొవిడ్‌ టీకా తీసుకున్నారు. ఇక టీకా వేసే సమయంలో కేరళకు చెందిన మరో నర్సు కూడా అక్కడ ఉన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.