సాగు చట్టాలకు నిరసనగా రైతు నేతలు చేపట్టిన భారత్ బంద్కు (Bharat bandh today) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. రైతులు శాంతియుతంగా చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే వారు ఈ విధంగా బంద్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం (Rahul Gandhi Twitter) ట్వీట్ చేశారు.
-
किसानों का अहिंसक सत्याग्रह आज भी अखंड है
— Rahul Gandhi (@RahulGandhi) September 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
लेकिन शोषण-कार सरकार को ये नहीं पसंद है
इसलिए #आज_भारत_बंद_है #IStandWithFarmers
">किसानों का अहिंसक सत्याग्रह आज भी अखंड है
— Rahul Gandhi (@RahulGandhi) September 27, 2021
लेकिन शोषण-कार सरकार को ये नहीं पसंद है
इसलिए #आज_भारत_बंद_है #IStandWithFarmersकिसानों का अहिंसक सत्याग्रह आज भी अखंड है
— Rahul Gandhi (@RahulGandhi) September 27, 2021
लेकिन शोषण-कार सरकार को ये नहीं पसंद है
इसलिए #आज_भारत_बंद_है #IStandWithFarmers
రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్కు (Bharat bandh today) మద్దతుగా నిలవాలని కాంగ్రెస్.. పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్కు మద్దతు తెలిపాయి.
దిల్లీ సరిహద్దుల్లోని గాజీపుర్ సహా దేశంలో వివిధ ప్రాంతాల్లో అన్నదాతలు చేపట్టిన బంద్ శాంతియుతంగా కొనసాగుతోంది.
ఈ బంద్ అందుకే..
భారత్ బంద్పై భారత్ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ (Rakesh tikait news) స్పందించారు..
"అంబులెన్సులు, డాక్టర్లు సహా అత్యవసర సేవలకు మేము ఎలాంటి అంతరాయం కలిగించం. కేవలం కేంద్రానికి సందేశం ఇవ్వడం కోసమే ఈ బంద్ చేపట్టాం. దుకాణాదారులు సాయంత్రం 4 వరకు షాపులు మూసి ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చర్చలకు మరోసారి సిద్ధమని కేంద్రం చెప్తున్నా అది కేవలం టీవీలకే పరిమితమైంది. మమ్మల్ని నేరుగా ఎవరూ సంప్రదించలేదు."
-రాకేశ్ టికాయిత్, రైతు నేత
ఇప్పటివరకు జరిగిన చర్చల్లో సాగు చట్టాల ప్రస్తావన తీసుకురాలేదన్నారు రాకేశ్ టికాయిత్. అవి తప్ప ఇతర ఏ సమస్యల గురించి అయినా చర్చించాలని కేంద్రం పేర్కొందని.. అలాంటప్పుడు చర్చల వల్ల ఫలితం లేదని భావిస్తున్నానని తెలిపారు.
ఇదీ చూడండి : డబుల్ డిగ్రీ చేసి.. వీధుల్లో 'చెత్త ఆటో' నడుపుతూ...