ETV Bharat / bharat

Bhagwant Mann: కీలక పదవికి రాజీనామా.. మాన్​ భావోద్వేగం - భగవంత్​ మాన్ ఎంపీ పదవికి రాజీనామా

Bhagwant Mann Resigns: పంజాబ్​ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్​ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంటుకు దూరమవుతున్నానంటూ.. ఆవేదన చెందారు. అయితే పంజాబ్​ ప్రజలు కీలక బాధ్యతను తనకు అప్పగించారని మాన్​ పేర్కొన్నారు.

Bhagwant Mann
Bhagwant Mann
author img

By

Published : Mar 14, 2022, 3:01 PM IST

Updated : Mar 14, 2022, 3:50 PM IST

Bhagwant Mann Resigns: పంజాబ్​ ఎన్నికల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిన ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్​ మాన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పంజాబ్​ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మాన్​.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాను కలిసి రాజీనామా లేఖ అందించారు.

రాజీనామాకు ముందు భావోద్వేగానికి గురయ్యారు మాన్. పంజాబ్​ ప్రజలు తనకు పెద్ద బాధ్యతను అప్పగించారని వ్యాఖ్యానించారు. "నేను పార్లమెంట్​కు దూరమవుతున్నాను. పంజాబ్ నాకు పెద్ద బాధ్యతను అప్పగించింది. తమ కుమారుడిగా భావించి.. ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు" అని మాన్​ పేర్కొన్నారు.

"కొన్నేళ్లుగా సంగ్రూర్ ప్రజలు.. నాపై చాలా ప్రేమను చూపారు. అందుకు ధన్యవాదాలు. ఇప్పుడు పంజాబ్​ మొత్తానికి సేవ చేసే అవకాశం వచ్చింది. కొన్నినెలల్లో లోక్‌సభలో పంజాబ్​ ప్రజల గొంతు మళ్లీ వినిపిస్తామని సంగ్రూర్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను."

-భగవంత్​ మాన్, పంజాబ్​లో ఆప్​ సీఎం అభ్యర్థి

ప్రజలందరికీ ఆహ్వానం

కాగా, ప్రమాణస్వీకార కార్యక్రమానికి పంజాబ్ ప్రజలందరినీ మాన్ ఆహ్వానించారు. 'నేనొక్కడినే ముఖ్యమంత్రిని కాలేదు. మీరంతా ముఖ్యమంత్రులే. ఇది మీ ప్రభుత్వం. భగత్ సింగ్ కలలుగన్న పంజాబ్​ను నిర్మించుకునే బాధ్యత మనందరిపైనా ఉంది. ఆయన ఆలోచనలను మార్చి 16 నుంచి ఆచరణలో పెడదాం' అని పేర్కొన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చే మహిళలు పసుపు రంగు దుపట్టా, పురుషులు పసుపు రంగు తలపాగా ధరించాలని పిలుపునిచ్చారు.

ఘన విజయం..

పంజాబ్​ ఎన్నికల్లో సంగ్రూర్​ జిల్లాలోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాన్.. ప్రత్యర్థి, కాంగ్రెస్​ అభ్యర్థి దళ్​వీర్​ సింగ్​ గోల్దేపై 58,206 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. ఈ నెల 16న భగత్​ సింగ్​ పూర్వీకుల గ్రామం ఖట్కడ్​ కాలలో మాన్​.. ప్రమాణ స్వీకారం చేయనున్నారు.​​ ఈ ఎన్నికల్లో ఆప్​ 92 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది.

ఇదీ చూడండి: 'ప్రధాని మోదీ పవర్​ఫుల్ లీడర్​.. కానీ'

Last Updated : Mar 14, 2022, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.