How to Verify if Your Aadhaar is Valid or Not in Telugu : దేశంలో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలతో పాటు, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన పత్రాలలో ఆధార్ కార్డు(Aadhaar Card) ముఖ్యపాత్ర పోషిస్తుంది. దేశంలో ప్రతి ఒక్కరికీ అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఆధార్ మారిపోయింది. ఆసుపత్రి నుంచి బ్యాంకులు, కాలేజీలు, రేషన్ షాపులు ఇలా ప్రతి చోట దీని అవసరం పడుతోంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆధార్ కార్డు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
Verify if Your Aadhaar is Valid or Not in Telugu : ఈ మధ్యకాలంలో ఆధార్ కార్డు వినియోగదారులు అనేక ఆన్లైన్ మోసాలకు(Cyber Frauds) గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో మీ ఆధార్ కార్డు కూడా అలాంటి మోసానికి గురయి ఉండవచ్చు. ఎందుకైనా మంచిది ఓసారి మీ ఆధార్ చెల్లుబాటులో ఉందో లేదో తెలుసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ మొబైల్లో సింపుల్‌గా ఈ స్టోరీలో మేము చెప్పే 4 ఉత్తమ పద్ధతులలో మీ ఆధార్ వెరిఫై చేసుకోండి.
How to Check if Aadhaar is Valid or Not on UIDAI Website :
UIDAI వెబ్‌సైట్‌లో మీ ఆధార్ కార్డును చెక్ చేసుకోండిలా..
- మొదట మీరు బ్రౌజర్‌లో UIDAI వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ఆ తర్వాత Check Aadhaar Validity అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఓపెన్ అయిన పేజీలో మీ ఆధార్ కార్డ్ నంబర్, అక్కడ వచ్చిన క్యాప్చా నమోదు చేయాలి.
- ఆ తర్వాత మీ ఆధార్ చెల్లుబాటు అవుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి.
- ఆధార్ నంబర్ నిజమైనది అయితే Age గ్రూప్, లింగం, నివాస రాష్ట్రం, ఆధార్‌తో నమోదు చేసుకున్న మాస్క్‌డ్ ఫోన్ నంబర్ లాంటి వివరాలు డిస్ప్లేపై కనిపిస్తాయి.
How to Check if Aadhaar is Valid or Not use mAadhaar App :
mAadhaar యాప్ ద్వారా మీ ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోండిలా..
- మొదట మీ ఫోన్‌లో mAadhaar యాప్ (Android, iOS) డౌన్‌లోడ్ చేసి.. దాన్ని ప్రారంభించాలి.
- ఆ తర్వాత Check Aadhaar Validity అనే ఆప్షన్‌కు వెళ్లి దానిపై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.
- మీ ఆధార్ నంబర్ నిజమైనది అయితే Age గ్రూప్, లింగం, నివాస రాష్ట్రం, ఆధార్‌తో నమోదు చేసుకున్న మాస్క్‌డ్ ఫోన్ నంబర్ లాంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
How to Check if Aadhaar is Valid or Not use Aadhaar QR Scanner
ఆధార్ QR స్కానర్‌ని ఉపయోగించి ఇలా ఆధార్ కార్డుని చెక్ చేసుకోండిలా..
- ముందు మీ ఫోన్‌లో ఆధార్ QR స్కానర్ యాప్ (Android, iOS)ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత యాప్‌ను అమలు చేయడానికి కెమెరా అనుమతిని అనుమతించాలి.
- అప్పుడు ఆధార్ కార్డ్‌లోని QR కోడ్‌ని స్కాన్ చేసి దాని చెల్లుబాటును తనిఖీ చేయాలి.
- స్కాన్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ గురించిన క్రింది వివరాలను చూపుతుంది.
- మాస్క్ చేసిన ఆధార్ నంబర్
- ఆధార్ హోల్డర్ పేరు
- పుట్టిన తేది
- చిరునామా
- దాచిన మొబైల్ నంబర్ (రిజిస్టర్డ్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ధృవీకరించవచ్చు)
- దాచిన ఇమెయిల్ చిరునామా (నమోదిత ఇమెయిల్‌ను నమోదు చేయడం ద్వారా ధృవీకరించవచ్చు) ఇలాంటి వివరాలు కనిపిస్తే మీ ఆధార్ నిజమైంది.
How to Check if Aadhaar is Valid or Not use mAadhaar App QR Scanner :
mAadhaar యాప్ QR స్కానర్ ద్వారా ఆధార్ చెక్ చేసుకోండిలా..
- మొదట మీ ఫోన్‌లో mAadhaar యాప్‌ని ప్రారంభించాలి.
- ఆ తర్వాత యాప్ డ్యాష్‌బోర్డ్ నుంచి QR కోడ్ స్కానర్ ఎంపికను ఎంచుకోవాలి.
- ఆపై స్కానింగ్ ప్రారంభించడానికి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఆధార్ చెల్లుబాటును ధృవీకరించడానికి ఆధార్ కార్డ్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయాలి.
- స్కాన్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్‌కు సంబంధించి క్రింది వివరాలను చూపుతుంది.
- మాస్క్ చేసిన ఆధార్ నంబర్
- ఆధార్ హోల్డర్ పేరు
- పుట్టిన తేది
- చిరునామా
- దాచిన మొబైల్ నంబర్
- దాచిన ఇమెయిల్ చిరునామా లాంటి వివరాలు అక్కడ డిస్ప్లే అవుతే మీ ఆధార్ నిజమైనదిగా భావించవచ్చు.
How to Download Masked Aadhaar Card Online : ముఖానికి సరే.. ఆధార్‌కు మాస్క్ తగిలించారా..? లేకపోతే...