ETV Bharat / bharat

kisan mahapanchayat lucknow: 'మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందే'

సాగు చట్టాల రద్దుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తేనే తాము స్వగ్రామాలకు వెళతామని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్ (rakesh tikait news) చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత కోరుతూ సంయుక్త్​ కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) ఆధ్వర్యంలో సోమవారం కిసాన్ మహాపంచాయత్ (kisan mahapanchayat lucknow) నిర్వహించారు. తమతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు టికాయిత్​.

kisan mahapanchayat lucknow
రాకేశ్ టికాయిత్
author img

By

Published : Nov 22, 2021, 7:15 PM IST

సాగు చట్టాల రద్దుతో పాటు రైతుల ఇతర సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్ టికాయిత్ డిమాండ్ చేశారు. మద్దతు ధరకు చట్టబద్ధత కోరుతూ సంయుక్త్​ కిసాన్ మోర్చ(ఎస్​కేఎం) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కిసాన్ మహాపంచాయత్ (kisan mahapanchayat lucknow) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

"వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించిన తర్వాత ప్రభుత్వం రైతులతో చర్చించాలనుకోవట్లేదు. చట్టాల రద్దుతోపాటు మాతో చర్చలు జరిపి మిగిలిన డిమాండ్లను నెరవేరిస్తేనే మేము గ్రామాలకు తిరిగి వెళ్తాము. ఎమ్​ఎస్​పీ, విత్తనాలు, కాలుష్య సమస్యలు కూడా పరిష్కరించాలి."

- రాకేశ్ టికాయిత్​, రైతు ఉద్యమ నాయకుడు

పీఎం నరేంద్ర మోదీ చట్టాల రద్దు ప్రకటన అనంతరం రైతులు ప్రధానంగా ఆరు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఎమ్​ఎస్​పీ చట్టబద్ధత, హోం శాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రాని పదవి నుంచి తొలగించటం, రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ, రైతుల ఉద్యమానికి గుర్తుగా స్మారకం, విద్యుత్​ చట్టం రద్దు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి: పార్లమెంట్​ సమావేశాల్లో విపక్షాల అస్త్రాలు ఇవే!

దిల్లీలో వాయుకాలుష్యం- 'స్కూళ్ల బంద్​' కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.