ETV Bharat / bharat

పోలీసుల సాయంతో స్వదేశం చేరిన పర్యటకుడు

మతిస్తిమితం కోల్పోయి భారత్​లో చిక్కుకున్న ఓ జర్మన్​ పర్యటకుడిని బెంగళూరు పోలీసులు తిరిగి అతని స్వదేశానికి పంపించారు. ఇందుకోసం జర్మన్​ ఎంబసీ తగిన ఏర్పాట్లు చేసింది.

మతిస్తితితం లేని జర్మన్ పర్యటకుడు, mentally ill german tourist in india
జర్మన్​ పర్యటకుడు
author img

By

Published : May 21, 2021, 11:11 AM IST

మతిస్తిమితం సరిగాలేని ఓ విదేశీయుడిని బెంగళూరు పోలీసులు అతని స్వదేశానికి పంపించారు. కుటుంబ సభ్యలతో జర్మనీ నుంచి పర్యటనకు వచ్చిన రోడ్రిగో ఆన్​ఫుట్​ ఏడాది నుంచి భారత్​లోనే ఉంటున్నట్లు సమాచారం.

ఏడాదిగా..

2019, నవంబర్ నుంచి 2020, నవంబరు వరకు గడువున్న టూరిస్ట్​ వీసా మీద 47 ఏళ్ల రోడ్రిగో తన కుటుంబసభ్యులతో కలిసి గతేడాది భారత్​కు వచ్చాడు. కుటుంబసభ్యులతో కలహాల కారణంగా వారు తిరిగి జర్మనీ వెళ్లిపోగా.. రోడ్రిగో భారత్​లోనే ఉండిపోయాడు. మతిస్తిమితం లేని కారణంగా బెంగళూరులో పలు చోట్ల ఆశ్రయం పొందుతూ గడుపుతున్నాడు. విషయం తెలుసుకున్న జర్మనీ ఎంబసీ అధికారులు.. రోడ్రిగోను మార్చిలో తిరిగి జర్మనీ పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అతను ఎయిర్​పోర్టు నుంచి తప్పించుకున్నాడు.

మతిస్తితితం లేని జర్మన్ పర్యటకుడు, mentally ill german tourist in india
రోడ్రిగో ఆన్​ఫుట్​తో పోలీసులు

ఆ దొంగ వల్ల..

సంపంగిరామ్ పట్టణ ప్రాంతంలోని ఆఆఎమ్​ హోటల్లో ఉంటున్న రోడ్రిగోపై ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. రోడ్రిగోను ఆరా తీయగా అతను వాగ్వాదానికి దిగాడు. రోడ్రిగో ప్రవర్తనతో అతనికి మతిస్తిమితం సరిగా లేదని భావించిన పోలీసులు.. అతని వీసా, పాస్​పోర్ట్​ ద్వారా వివరాలు తెలుసుకున్నారు.

జర్మన్​ ఎంబసీ సలహా మేరకు రోడ్రిగోకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.

సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎంబసీ అధికారులను సంప్రదించి వారికి ఫ్లైట్​ టికెట్​ను అందించారు. చికిత్స పూర్తి చేసుకున్న రోడ్రిగో ఈనెల 4న తెల్లవారుజామున 4 గంటలకు జర్మనీకి తిరుగు ప్రయాణం అయ్యాడు.

ఇదీ చదవండి : రెండుసార్లు కరోనాను జయించాడు.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.