ETV Bharat / bharat

ఆ దొంగ కళ్లన్నీ ఖరీదైన 'సైకిళ్ల'పైనే- ఏకంగా రూ.10లక్షలు...

author img

By

Published : Sep 25, 2021, 1:08 PM IST

అతడో దొంగ. అలా అని ఏది పడితే అది దోచేయడు. కళ్లన్నీ ఖరీదైన సైకిళ్ల మీదే! అందుకోసం పకడ్బందీగా రెక్కీ నిర్వహించి రంగంలోకి దిగుతాడు. అలా కొన్ని నెలల్లోనే 45 ఖరీదైన సైకిళ్లను కొట్టేశాడు. వీటి విలువ రూ. 10లక్షలు పైమాటే. ఎంత పక్కాగా ప్రణాళిక వేసినా.. చివరికి పోలీసులకు చిక్కక తప్పదు. ఈ వ్యవహారంలోనూ అదే జరిగింది.

Bengaluru theft
దొంగ

కర్ణాటక బెంగళూరులో రోజువారీ కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని ఇటీవలే సంజయ్​ నగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నగరం అంతటా ఖరీదైన సైకిళ్లను దొంగలిస్తున్నాడనే నేరంతో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 10లక్షలు విలువ చేసే 45సైకిళ్లను సీజ్​ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం..

నిందితుడు.. అతడి స్నేహితుడితో కలిసి కొంతకాలంగా ఖరీదైన సైకిళ్లను దొంగలిస్తున్నాడు. ఇద్దరు కలిసి సాయంత్రం వేళ సంజయ్​ నగర్​, హెబ్బల్​, మరాథాహళ్లి, నందిని లేఅవుట్​, యెలహంక న్యూ టౌన్​, అమృతహళ్లి, హైగ్రౌండ్స్​ సైకిళ్ల వేటలో పడేవారు. ఏదైనా సైకిల్​ కనిపిస్తే.. రాత్రికి దాన్ని దొంగలించేవారు. మరో వ్యక్తి సహాయంతో దానిని అమ్మేసేవారు.

నగరంలో నేరాలకు అడ్డుకట్టవేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు సెప్టెంబర్​ 19 ఓ ఆపరేషన్​ను నిర్వహించారు. 40- 50 మందిపై నిఘా పెట్టారు. వారిలో ఒకరి వద్ద కట్టర్​ ఉందని, సైకిళ్లను దొంగలించేందుకు దానిని వాడుతున్నాడని పోలీసులకు తెలిసింది. చివరికి సెప్టెంబర్​ 22న సైకిల్​ దొంగ, అతడి స్నేహితుడిని అరెస్ట్​ చేశారు. సైకిళ్లు అమ్మేందుకు సహాయం చేసిన వ్యక్తి పారిపోయాడు.

బీఎండబ్ల్యూ, స్కాట్​, అట్లాస్​ అల్టిమేట్​ కోడ్​, బీ-ట్విన్​, హెర్క్యులస్​, కీస్టో వంటి హై-ఎండ్​ సైకిల్​ మోడల్స్​ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

సైకిళ్ల​ దొంగతనం వ్యవహారంలో బెంగళూరు వ్యాప్తంగా 15 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 19సైకిల్​ ఓనర్లను గుర్తించారు. వారికి సైకిళ్లు తిరిగిచ్చే పనిలో ఉన్నారు పోలీసులు.

మరోవైపు నిందితుల మీద ఎఫ్​ఐఆర్​ నమోదైంది. కేసులో విచారణ ముమ్మరం చేశారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.