చికెన్ ఫ్రై సరిగా చేయలేదని.. భార్యను చంపిన దారణమైన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
ఏం జరిగిందంటే?
షిరిన్ బాను(25), ముబారక్(32) దంపతులు. ముబారక్ ఓ వ్యాపారి. బెంగళూరు సొలదేహనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తరబనహళ్లిలో రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. వంట సరిగా చేయటం లేదని ముబారక్ నిత్యం షిరిన్తో గొడవపడేవాడు. తన భర్త వేధింపులు పడలేక.. ఇదే విషయాన్ని పలుమార్లు తన తల్లిదండ్రులతో చెప్పింది షిరిన్. ఇటీవల రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు.. ఇద్దరికీ నచ్చజెప్పారు.
అయితే తాజాగా.. ముబారక్, షిరీన్‌ను చికెన్‌ఫ్రై చేయమన్నాడు. అది రుచిగా చేయలేదన్న కోపంతో షిరిన్‌ను దూషించి.. చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేశాడు.
కట్టుకథ అల్లి..
తనతో గొడవపడి ఇంట్లోనుంచి వెళ్లిపోయిందని షిరిన్ తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు ముబారక్. అల్లుడి ప్రవర్తనపై అనుమానం కలిగిన షిరిన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు 18 రోజులుగా ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా ముబారక్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో.. తానే హత్య చేసినట్లు ముబారక్ ఒప్పుకున్నాడు.
ఇదీ చదవండి: భర్త చికెన్ తిన్నాడని.. భార్య సూసైడ్!