బంగాల్లో అధికారంలోకి రాగానే.. రాష్ట్రాన్ని సోనార్బంగ్లాగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బంగాల్లోని ఖరగ్‌పుర్‌లో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. భాజపా సభలకు హాజరవుతున్న జనాన్ని చూస్తుంటే.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలుస్తోందన్నారు. భాజపా అధికారంలోకి రాగానే నిజమైన పరివర్తన తీసుకువస్తామని.. మరోసారి సోనార్ బంగ్లాను సృష్టిస్తామని షా అన్నారు.
సోమవారం.. ఝార్గ్రామ్ నుంచి భగవాన్ బిర్సా ముండా సిడో-కన్హు సమ్మాన్ యాత్రను అమిత్ షా ప్రారంభిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నాటి యోధులు జరిపిన పోరాటానికి గుర్తుగా ఈ యాత్రను చేపడుతున్నట్లు భాజపా తెలిపింది.
ఇదీ చూడండి: 'దేశాన్ని విభజించే శక్తులతో కాంగ్రెస్ పొత్తు'