బంగాల్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 31 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సాగుతోంది. 205 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని సుమారు 78.5 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.
హూగ్లీ జిల్లాలోని 8 నియోజకవర్గాలకు, హావ్డా జిల్లాలోని 7 నియోజకవర్గాలకు, దక్షిణ పరగణాల జిల్లాలోని 16 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
దక్షిణ 24 పరగణాలలోని డైమండ్ హార్బర్ నుంచి భాజపా అభ్యర్థి దీపక్ హల్దార్.. అబ్దుల్పుర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
618 కంపెనీల కేంద్ర బలగాలు..
మూడో దశ ఎన్నికలు జరుగుతున్న దక్షిణ 24 పరగణాలు, హావ్డా, హూగ్లీ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 10,871 పోలింగ్ కేంద్రాల వద్ద 618 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఓటర్లు కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: ఉన్నవి 90 ఓట్లు.. పోలైనవి 171