ETV Bharat / bharat

రేప్​ కేసు వాపస్​ తీసుకోవాలని బెదిరింపులు.. నిప్పంటించుకున్న బాలిక - కన్నతల్లినే కడతేర్చిన కుమార్తె

Bengal minor sets fire: ఓ నిందితుడు.. తనపై పెట్టిన అత్యాచార యత్నం కేసును వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో 14 ఏళ్ల మైనర్​ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరోవైపు కన్నతల్లినే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేసింది ఓ కుమార్తె. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది.

Bengal minor sets fire
మైనర్ ఆత్మాహత్యయత్నం
author img

By

Published : Apr 15, 2022, 9:00 PM IST

Updated : Apr 25, 2022, 1:32 PM IST

Bengal minor sets fire: పశ్చిమ బంగాల్​లో దారుణం జరిగింది. తన మీద పెట్టిన అత్యాచార యత్నం​ కేసును వెనక్కి తీసుకోవాలని 14 ఏళ్ల బాలికను బెదిరించారు ఓ ఇద్దరు కిరాతకులు. లేదంటే కుటుంబాన్నే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమె భయంతో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. మయినాగుడి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 28న ఒంటరిగా ఉన్న సమయంలో తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడని కేసు పెట్టింది బాలిక. నిందితుడిని పోలీసులు అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యే బెయిల్​పై విడుదలయ్యాడు. అనంతరం బాలిక ఇంటికి మరో వ్యక్తితో వెళ్లి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించాడు. దీంతో ఆమె నిప్పంటించుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తల్లిని చంపిన కుమార్తె: మరో వైపు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తల్లినే చంపింది ఓ కుమార్తె. తన భర్తతో కలిసి కుట్రలు పన్నింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గ్రేటర్​ నోయిడాలో శుక్రవారం జరిగింది. బాధితురాలి భర్త మరణించడం వల్ల ఆమెకు 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చింది. ఈ నగదు కోసం తరచూ ఆమె కుమార్తె, అల్లుడు హింసించేవారని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంటగదిలో నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె కూతురు మీను, భర్త మహవీర్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: నీటి కోసం 2 కి.మీ నడక.. నిచ్చెన, తాళ్లతో బావిలోకి దిగి..

Last Updated : Apr 25, 2022, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.