ETV Bharat / bharat

బంగాల్​ భాజపా అధ్యక్షుడి​ కాన్వాయ్​పై రాళ్లదాడి - బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు

బంగాల్​ ఉత్తర 24 పరగణాల జిల్లాలో భాజపా పరివర్తన​ యాత్ర సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ కాన్వాయ్​పై దాడి జరిగింది. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసమవగా.. నలుగురు పార్టీ కార్యకర్తలు గాయపడినట్లు నేతలు తెలిపారు. మరోవైపు.. తమ పార్టీ కార్యాలయాన్ని భాజపా గూండాలు ధ్వంసం చేశారని టీఎంసీ ఆరోపించింది.

Bengal BJP chief Dilip Ghosh's convoy attacked
బంగాల్​ భాజపా అధ్యక్షుడి​ కాన్వాయ్​పై రాళ్ల దాడి
author img

By

Published : Feb 21, 2021, 6:14 AM IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బంగాల్​లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓ వైపు ప్రచార పర్వం ఊపందుకుంటుంటే మరోవైపు దాడి ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ కాన్వాయ్​పై దాడి జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లా మినాఖా ప్రాంతంలోని మలాంచలో పార్టీ పరివర్తన యాత్ర నిర్వహిస్తున్న క్రమంలో టీఎంసీ కార్యకర్తలు తమపై రాళ్లు, బాంబు దాడులు చేసినట్లు భాజపా నేతలు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు పార్టీ కార్యకర్తలు గాయపడినట్లు చెప్పారు.

Bengal BJP chief Dilip Ghosh's convoy attacked
దాడిలో గాయపడిన భాజపా కార్యకర్తలు

ధ్వంసమైన వాహనం

అయితే.. ఈ ఘటనలో ఎలాంటి బాంబులు వినియోగించలేదని, ప్రాణనష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత భాజపా, టీఎంసీ నేతల మధ్య ఘర్షణ జరిగిందని వెల్లడించారు. రెండు వాహనాలు దెబ్బతిన్నట్లు చెప్పారు.

భాజపా నేతలతో మాట్లాడుతున్న పోలీసులు

టీఎంసీ కార్యాలయం ధ్వంసం!

దిలీప్​ ఘోష్​ కాన్వాయ్​పై దాడి జరిగిన నేపథ్యంలో అధికార తృణమూల్​ కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేసింది భాజపా. అయితే.. భాజపా ఆరోపణలను తిప్పికొట్టింది టీఎంసీ. మినాఖాలోని తమ పార్టీ కార్యాలయాన్ని కాషాయ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు తెలిపింది. అలాగే.. ఓ పాల వ్యాన్​పైనా భాజపా గూండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించింది.

ధ్వంసమైన టీఎంసీ కార్యాలయం

పెరుగుతున్న దాడులు..

కొద్ది రోజుల క్రితం మినాఖా ప్రాంతంలో జరిగిన ఘర్షణలో భాజపా నేత పిటోజ్​ కమల్​ గాజీ గాయపడ్డారు. అలాగే.. గత ఏడాది డిసెంబర్​లో దక్షిణ 24 పరగణాల జిల్లాలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్లదాడి జరిగింది.

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​ బస్సు ప్రమాదంలో 54కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.