ETV Bharat / bharat

కూలీ పనుల కోసం చిన్నారుల అక్రమ రవాణా!

కూలీ పనులు కోసం బిహార్​ నుంచి పంజాబ్​కు తరలిస్తున్న 52 మంది పిల్లలను ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు రక్షించారు. దీనికి సంబంధించి ఐదుగురిని అరెస్ట్​ చేశారు.

children rescued in Lucknow
చిన్నారుల అక్రమ రవాణా
author img

By

Published : Jul 2, 2021, 5:03 AM IST

పంజాబ్​లో కూలీ పనులు చేయించడానికి బిహార్​ నుంచి తీసుకెళ్తున్న 52 మంది చిన్నారులను ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్​ చేశారు. మొరాదాబాద్​లో 12 మందిని.. మరో కేసులో 40 మంది చిన్నారులను రక్షించారు. అయితే ఈ పిల్లలంతా 12 నుంచి 15ఏళ్ల లోపు వారేనని అధికారులు తెలిపారు.

పిల్లలను ప్రశ్నించగా.. వారు భయంతో నోరు మెదపలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితులను విచారించగా.. బాధిత పిల్లలంతా బిహార్​లోని పుర్ణియా జిల్లాకు చెందినవారుగా తెలిసిందని.. వారిని పంజాబ్​లో కూలీ పనులు చేయడానికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. అయితే మానవ అక్రమ రవాణా జరుగుతుందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ చిన్నారులకు వసతి, భోజనం, బట్టలు ఇచ్చి హోటళ్లు, ఇళ్లల్లో పనులు చేయించుకుంటారని పోలీసుల తెలిపారు.

ఇదీ చూడండి: ఘోర ప్రమాదం- నలుగురు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.