ETV Bharat / bharat

'కష్టాలు విన్నారు.. కరుణ చూపారు' - బీసీఐ

కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు ప్రభుత్వపరంగా సాయం అందించాలని కోరుతూ.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు లేఖ రాయడాన్ని బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా(బీసీఐ) స్వాగతించింది. ఈ మేరకు బీసీఐ ఓ ప్రకటనలో జస్టిస్​ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలిపింది.

BCI hails CJI N V Ramana
సీజేఐ
author img

By

Published : Jun 28, 2021, 5:48 AM IST

Updated : Jun 28, 2021, 7:28 AM IST

కొవిడ్‌ కారణంగా కోర్టులు పనిచేయక ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు ప్రభుత్వపరంగా ఆర్థికసాయం అందించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాయడాన్ని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) స్వాగతించింది. ఈ మేరకు బీసీఐ ఛైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా ఆదివారం ఓ ప్రకటనలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ధన్యవాదాలు తెలిపారు.

"భారత న్యాయవ్యవస్థకు నేతృత్వం వహిస్తున్న ఓ వ్యక్తి.. తొలిసారిగా లేదంటే సుదీర్ఘకాలం తర్వాత న్యాయవాదుల కష్టాలను కరుణతో విన్నారు. వారి ఇబ్బందుల పట్ల తగినరీతిలో స్పందించారు. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రాసిన లేఖ ఆయన ధైర్యాన్ని, ఎంత ఎదిగినా క్షేత్రస్థాయి వాస్తవాలను మరిచిపోని గొప్ప గుణాన్ని చాటి చెబుతోంది. గత ఏడాదిన్నర కాలంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ఆయన పడుతున్న ఆవేదనకు అద్దం పట్టింది. పరిస్థితులను కచ్చితంగా అర్థం చేసుకొని కిందిస్థాయి న్యాయవ్యవస్థలో.. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని న్యాయవాదులు పడుతున్న బాధల గురించి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు, అన్నిచోట్ల కోర్టులకు నిరంతరాయమైన ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ఐటీ శాఖ మంత్రిని కోరడం ఓ విప్లవాత్మక ముందడుగే. ఇప్పుడు న్యాయవాదులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొస్తుందని ఆశిస్తున్నాం. ఇలాంటి ధైర్యవంతుడు, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన ప్రధాన న్యాయమూర్తి అవసరం మన దేశానికి ఎంతో ఉంది. సాధారణంగా ఓ న్యాయవాది న్యాయమూర్తి అయిన తర్వాత బార్‌ ఎదుర్కొంటున్న నిజమైన కష్టాలను మరిచిపోతుంటారు. కానీ జస్టిస్‌ రమణ తాను కష్టాలను గుర్తుంచుకుంటానని నిరూపించారు. ముఖ్యంగా యువ న్యాయవాదుల ఇబ్బందులను ఆయన అర్థం చేసుకున్నారు. వినయవంతమైన న్యాయమూర్తుల్లో కనిపించే అరుదైన లక్షణమిది. తాను కఠోర శ్రమ, పనితీరునే నమ్ముతాను తప్ప మీడియా ప్రచారాన్ని కాదని జస్టిస్‌ రమణ స్పష్టంగా నిరూపించారు. వ్యాక్సినేషన్‌ విషయంలోనూ ఆయన న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఇతర సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని వాదించారు. శనివారం నిర్వహించిన వెబినార్‌లో కూడా ఆయన సాధారణ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. సాంకేతిక సౌకర్యం అందుబాటులో లేని న్యాయవాదుల బాగోగులను విస్మరిస్తే వారు పనికి దూరమై, ఆదాయం కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఓ తరం న్యాయవాదులు వ్యవస్థ నుంచి కనుమరుగవుతారని.. అది చాలా ప్రమాదకరమని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తన మనోభావాన్ని వ్యక్తం చేశారు" అని బార్​ కౌన్సిల్​ ప్రకటనలో పేర్కొంది.

న్యాయరథానికి బార్‌, బెంచ్‌ రెండూ చక్రాల్లాంటివని.. ఇప్పుడు న్యాయవాద సమాజం గురించి అత్యున్నత న్యాయవ్యవస్థ చిత్తశుద్ధితో కూడిన ఆవేదన వ్యక్తం చేయడాన్ని చూసి ఈ దేశ న్యాయవాద వర్గం హర్షిస్తోందని బార్‌ కౌన్సిల్‌ ప్రకటనలో అభిప్రాయపడింది. సీజేఐ చేసిన సూచనలను సానుకూలంగా పరిశీలించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు మనన్‌ కుమార్‌ మిశ్రా అన్నారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ధన్యవాదాలు చెబుతూ పలు రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లు.. హైకోర్టు, ఇతర బార్‌ అసోసియేషన్ల నుంచి మాకు ఎన్నో ఫోన్లు వచ్చాన్న మిశ్రా.. ప్రధాన న్యాయమూర్తిలో కనిపించిన ఈ అరుదైన గుణం ఆయన కాలంలో న్యాయవ్యవస్థ విప్లవాత్మక మార్పులను చవిచూస్తుందని, సుప్రీంకోర్టు నుంచి ప్రజా సంక్షేమం, ప్రయోజనాలకు సంబంధించిన చరిత్రాత్మక తీర్పులు వస్తాయన్న నమ్మకాన్ని కల్పించిందన్నారు. రాజ్యాంగాన్ని సంరక్షించే నిజమైన వ్యవస్థ, ప్రజాస్వామ్య సౌధానికి బలమైన మూలస్తంభం తానేనని న్యాయవ్యవస్థ నిరూపించబోతోందన్నారు. న్యాయవ్యవస్థ కీర్తిప్రతిష్ఠలు మరింత ఇనుమడిస్తాయని అని మనన్‌ కుమార్‌ మిశ్రా ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ప్రాధాన్యం కోల్పోయిన పాత చట్టాలను మార్చాలి'

Last Updated : Jun 28, 2021, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.