Electronic E-Jeep: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటం వల్ల విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇప్పటికే పలు సంస్థలు ఎలక్ట్రిక్ బైక్స్, కార్లను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ జీప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వాహనం నిర్వహణకు తక్కువ ఖర్చు అవడమే అందుకు కారణం. ఈ-జీప్ కేవలం ఒక యూనిట్ ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
బటిండా జిల్లాలోని విశ్వకర్మ మార్కెట్‌లో ఉన్న డెంటింగ్ పెయింటర్ గురుచరణ్ సింగ్ ఎలక్ట్రిక్ జీప్‌ను రూపొందించాడు. ఇంతకుముందు మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లు తయారీ సంస్థలు ఫైబర్ మెటీరియల్‌ను ఉపయోగించాయని, అయితే తాము అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ జీప్‌లో ఇనుము ఉపయోగించామని సింగ్ చెబుతున్నాడు. దీని నిర్మాణానికి దాదాపు వారం రోజులు పట్టిందని తెలిపాడు.
"పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు నిర్మించిన ఈ ఎలక్ట్రిక్ జీప్ ధర దాదాపు రూ. 15 లక్షలు ఉంటుంది. మా ప్రాంతానికి వచ్చే కొత్త వారు జీప్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసేందుకు ఆర్డర్‌ను అందుకున్నాను. పెరుగుతున్న చమురు ధరల నుంచి ప్రజలు విముక్తి పొందుతారు. ఈ ఎలక్ట్రానిక్ జీప్ సమర్థంగా పనిచేస్తుంది. "
--గురు చరణ్ సింగ్
ఇవీ చదవండి: సీఎంతో మీటింగ్‌కు వచ్చి ప్లేట్ల కోసం ఫైట్- చిక్కుల్లో ప్రధానోపాధ్యాయులు