ETV Bharat / bharat

'మోదీ ఓడేది లేదు.. రాహుల్​కు పెళ్లి అయ్యేది లేదు'.. కర్ణాటక మాజీ సీఎం బొమ్మై కామెంట్స్​ - కాంగ్రెస్​పై బొమ్మై సీరియస్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్​ బొమ్మై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రధాని మోదీ ఓడిపోయేది లేదని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పెళ్లి జరిగేది లేదన్నారు. దేశంలోని కొందరు నాయకులు థర్డ్​ ఫ్రంట్​ అంటూ పట్నాలో సమావేశమై.. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో మోదీని ఎలా ఓడించాలనే విషయంపై మాత్రమే చర్చించారన్నారు.

bommai addresing the bjp meeting
బీజేపీ సమావేశంలో మాట్లాతున్న బొమ్మై
author img

By

Published : Jun 25, 2023, 10:49 PM IST

'దేశంలో ప్రధాని మోదీ ఓడిపోయేది లేదు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పెళ్లి జరిగేది లేదు' అని ఎద్దేవా చేశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్​ బొమ్మై. దేశంలోని కొందరు నాయకులు థర్డ్​ ఫ్రంట్​ అంటూ పట్నాలో సమావేశమై.. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో మోదీని ఎలా ఓడించాలనే విషయంపై మాత్రమే చర్చించారని బస్వరాజ్​ బొమ్మై అన్నారు. దేశ ప్రజల ప్రగతి గురించి కాకుండా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎలా పెళ్లి చేయాలని వారు సమావేశం నిర్వహించారని వ్యంగ్రాస్తాలు సంధించారు. కానీ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోయేది లేదని.. రాహుల్ గాంధీకి పెళ్లి జరిగేది లేదని ఆయన స్పష్టం చేశారు.

బెళగావి గాంధీభవన్​లో ఆదివారం నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బొమ్మై.. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. మోదీకి ప్రత్యామ్నాయంగా ఒక నాయకుడు లేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలా ఎంపిక చేసుకుంటారని.. మోదీకి వ్యతిరేకంగా నిలబడే నాయకుడు దేశ రాజకీయ పార్టీల్లోనే లేడని బొమ్మై చెప్పారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని.. కర్ణాటకలో బీజేపీ మళ్లీ 25 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

"దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల కుంభకోణాలు జరిగాయి. కానీ మోదీ ప్రభుత్వంలో స్కాంలకు తావులేదు. మేము ప్రజలకు మంచి పాలనను అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లను మోదీ ప్రభుత్వం నిర్మించింది. జల్​జీవన్ మిషన్​ పథకం కింద.. దేశంలోని 11 కోట్ల ఇళ్లకు మంచినీటి సదుపాయం కల్పించింది బీజేపీ ప్రభుత్వం. ఈ పథకంలో కర్ణాటకలో 40 లక్షల ఇళ్లకు మంచినీరు అందుతోంది. మేము అధికారంలోకి వచ్చాక గోహత్యలను నివారించాము. మత మార్పిడి నిరోధక చట్టం, దేవాలయాలకు నిధుల కేటాయింపు, దేవాలయాలకు రక్షణ, హిందు ధర్మ పరిరక్షణ కోసం, సంస్కృతి, రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు పని చేశాము. కానీ ఇప్పుడు కర్ణాటక ఆర్​టీసీ దీన స్థితిలోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. డీజీల్ కరవై బస్సులు ఆగిపోతాయి. రాష్ట్రం అంధకారంలోకి పోతుంది"

- బస్వరాజ్​ బొమ్మై, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.

ఈ సమావేశంలో పాల్గొన్న విజయపుర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భాషనగౌడ పాటిల్ మాట్లాడుతూ.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోదని తెలిపారు. లోక్​సభ ఎన్నికల కంటే ముందు లేదా తర్వాత వారి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన అన్నారు. కార్యకర్తలను పట్టించుకోకపోతే వారి నాయకులను వారే ఓడగొడతారని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బొమ్మై ప్రతి నియోజకర్గంలో కనీసం రెండు గంటలపాటు సమావేశమయ్యారని.. లేకపోతే విజయపురలో ఆయన విజయం సాధ్యమయ్యేది కాదని గుర్తుచేశారు. పాకిస్థాన్ ఎలా అయితే దివాళా తీసిందో.. భారత్​ను కూడా వారు అదే పరిస్థితికి తీసుకొస్తారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఆయన గుర్తుచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.