అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో తెలియదు. కొన్నిసార్లు ఊహించని విధంగా వరిస్తుంది. బిహార్ మధుబనీలోని ఓ అశోక్ కుమార్ ఠాకుర్ జీవితంలోనూ ఇదే జరిగింది. ఓ చిన్న సెలూన్ షాప్ నడిపే అశోక్‌కు 'డ్రీమ్-11'(dream11 winner name) రూపంలో అదృష్టం వరించింది. రూ. కోటి అతడి వశమైంది.
నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్‌కు ఓ సెలూన్ షాప్ ఉంది. ఆ సెలూనే అతడికి జీవనాధారం. కాగా.. క్రికెట్‌పై ఆసక్తితో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్-11లో తరచూ బెట్టింగ్ పెడుతూ ఉంటాడు. ఆదివారం చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్(csk vs kkr) మ్యాచ్‌పైనా బెట్టింగ్ పెట్టాడు అశోక్. అనూహ్యంగా రూ. కోటి దక్కించుకున్నాడు.
అది చూసి అశోక్‌కు ఆ రాత్రి నిద్రపట్టలేదు. మరుసటి రోజు.. ఆ ప్రాంతమంతా అశోక్ పేరు మారుమోగిపోయింది. గతంలో ఎన్నోసార్లు బెట్టింగ్ పెట్టానని, కానీ ఎప్పుడూ గెలవలేదని గుర్తుచేసుకున్నాడు అశోక్. రెండు, మూడు రోజుల్లో నగదు అతడి బ్యాంకు ఖాతాలో చేరే అవకాశముంది.
రూ. కోటి వచ్చినా.. తన వృత్తిని మాత్రం వదులుకోనని తేల్చిచెప్పాడు అశోక్. సెలూన్‌లోనే పనిచేస్తానని, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని అంటున్నాడు.
ఇదీ చూడండి:- లాటరీ 'లక్కు'తో కోటీశ్వరుడైన ఆటోవాలా