Baramulla encounter: అనేక మంది జవాన్లు, పౌరుల్ని బలిగొన్న కరడుగట్టిన ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రూను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అతడితోపాటు మరో ముష్కరుడ్నీ హతమార్చారు. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని మాల్వా ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు నిఘా వర్గాలకు గురువారం సమాచారం అందింది. దీంతో సాయుధ దళం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. బలగాలపై ముష్కరులు తొలుత కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది దీటుగా తిప్పికొట్టారు.
"ఇటీవల బుద్గాం జిల్లాలో ఒక ప్రత్యేక పోలీసు అధికారి, అతని సోదరుడు, ఒక సైనికుడు, పౌరుడిని హత్య చేయడంలో కంత్రూ ప్రమేయం ఉంది. 2020 సెప్టెంబరులో బుద్గాం జిల్లాలోని ఖాగ్ ప్రాంతంలో బీడీసీ ఛైర్మన్ సర్దార్ భూపిందర్ సింగ్‌ను కూడా కంత్రూ హత్య చేశాడు. కంత్రూ ఎన్కౌంటర్ భద్రతా బలగాలు సాధించిన పెద్ద విజయం. "
-విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్- కశ్మీర్ జోన్
ఇదీ చదవండి: ఆదేశాలిచ్చినా కూల్చివేతలు ఆపరా?: సుప్రీం