Bank of India Recruitment: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. 696 ఖాళీలను భర్తీ చేసేందుకు కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది బీఓఐ. ఐటీ అధికారులు, మేనేజర్లు, సాంకేతిక నిపుణులు, క్రెడిట్ ఆఫీసర్లు, ఆర్థికవేత్తలు, గణాంకవేత్తలను ఈ ప్రక్రియ ద్వారా నియమించుకోనుంది.
ఖాళీల వివరాలు ఇలా..
• మొత్తం పోస్టులు - 696
• రెగ్యులర్ తరహాలో భర్తీ చేసేవి - 594
• కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేవి - 102
రెగ్యులర్ పోస్టుల వివరాలు
• ఆర్థికవేత్త - 2
• గణాంకవేత్త - 2
• రిస్క్ మేనేజర్ - 2
• క్రెడిట్ అనలిస్ట్ - 53
• క్రెడిట్ ఆఫీసర్ - 484
• టెక్ అప్రైసల్ - 9
• ఐటీ ఆఫీసర్.. డేటా సెంటర్ - 42
ముఖ్యమైన తేదీలు
• ఏప్రిల్ 24 నుంచి ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
• దరఖాస్తుకు మే 10 చివరి తేదీ
• పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.
హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దేహ్రాదూన్, జైపుర్, జమ్ము, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పనాజీ, పట్నా, రాంచీ, శిమ్లా, తిరువనంతపురం నగరాల్లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
జీతభత్యాలు..
• ఈ పోస్టులకు ఎంపికైతే ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. నాలుగు వేతన స్కేల్ల ప్రకారం చెల్లింపులు ఉండనున్నాయి. కనిష్ఠంగా రూ.36వేలు.. గరిష్ఠంగా రూ.89,890 వేతనం లభించనుంది.
అర్హతలు
• ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు బ్యాంకు నిర్దేశించిన కనీస విద్యా అర్హతలు ఉండాలి. వీటితో పాటు సంబంధిత ఫీల్డ్‌లో తగిన అనుభవం ఉండాలి. వయసు పరిమితికి లోబడి ఉండాలి. ఈ అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్లో ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ
• సంబంధిత పోస్టుకు వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఎలా అప్లై చేసుకోవాలి?
www.bankofindia.co.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
• ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
• జనరల్ కేటగిరీ, ఇతరులకు రూ.850
ఇదీ చదవండి: ఎస్సై నోటిఫికేషన్ వచ్చేసింది... ఇంజినీర్ పోస్టులకు కూడా..