ETV Bharat / bharat

బ్యాంక్​ మేనేజర్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించిన గార్డ్.. చిన్నారిని ఎండలో కట్టేసి.. - దత్తత తీసుకున్న ఐదేళ్ల బాలికపై వైద్యుల చిత్రహింసలు

బ్యాంక్​ మేనేజర్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు సెక్యూరిటీ గార్డ్​. దాడిలో మేనేజర్​ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం ఈ ఘటనకు దారితీసింది. ఉత్తరాఖంఢ్​లో ఈ దారుణం జరిగింది. మరోవైపు దత్తత తీసుకున్న ఐదేళ్ల బాలికను ఎండలో తాళ్లతో కట్టేశారు ఇద్దరు వైద్యులు. అసోంలో ఈ ఘటన జరిగింది.

bank-manager-burnt-by-guard-in-uttarakhand-guard-attack-on-bank-manager-in-uttarakhand
Etv ఎస్​బీఐ బ్యాంక్​ మేనేజర్​పై పెట్రోల్​ పోసి నిప్పంటిని సెక్యూరిటీ గార్డ్
author img

By

Published : May 6, 2023, 10:54 PM IST

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా బ్యాంక్​ మేనేజర్​పై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ సెక్యూరిటీ గార్డ్​. దీంతో బ్యాంక్​ మేనేజర్​ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 40 శాతం శరీరం.. మంటల్లో కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. బ్యాంక్​ మేనేజర్​ సెక్యూరిటీ గార్డుల మధ్య జరిగిన గొడవ.. ఈ దారుణానికి కారణమైందని పోలీసులు వివరించారు. ఉత్తరాఖండ్​లో​ ఘటన జరిగింది. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పితోరాగఢ్​ జిల్లా, దార్చులాలో ఉన్న స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మేనేజర్​ అయిన మహ్మద్​పై ఈ దాడి జరిగింది. అదే బ్యాంక్​లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దీపక్ క్షేత్రి అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. అంతకుముందు మేనేజర్​కు, సెక్యూరిటీ గార్డ్​ మధ్య ఓ విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ వివాదం మరింత ఎక్కువ కావడం వల్ల విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు.. మేనేజర్​పై పెట్రోల్​ పోశాడు. అనంతరం అగ్గిపెట్టెతో నిప్పు అంటించాడు.

మేనేజర్​ మంటల్లో కాలిపోవడాన్ని గమనించిన బ్యాంక్​లో ఉన్నవారు.. వెంటనే స్పందించారు. మహ్మద్​కు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన చికిత్స కోసం రిషికేశ్ ఎయిమ్స్ తరలించారు. బ్యాంక్ మేనేజర్ మహ్మద్..​ బిహార్​కు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామ వారు వెల్లడించారు. నిందితుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

దత్తత తీసుకున్న బాలికపై దారుణం..
ఆ ఇద్దరు భార్యభర్తలు ప్రముఖ వైద్యులు. భర్త శస్త్ర చికిత్స నిపుణులు అయితే.. భార్య మానసిక వైద్యురాలు. టెలివిజన్​ కార్యక్రమాల్లోనూ ఈమె కౌన్సిలింగ్​ చేస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో సైతం భార్యభర్తలిద్దరు చురుగ్గా ఉంటూ.. రోగులకు సలహాలు సూచనలు ఇస్తుంటారు. కాకపోతే దత్తతకు తీసుకున్న బిడ్డను మాత్రం చిత్రహింసలకు గురిచేశారు. ఐదేళ్ల బాలికను ఎర్రటెండలో మేడపై తాళ్లతో కట్టేశారు. అభం శుభం ఎరుగుని ఆ చిన్నారిని.. శారీరకంగా, మానసికంగా హింసించారు. అసోం రాజధాని గువాహటిలో ఈ దారుణం జరిగింది.

adopted five year old girl tortured by Two doctors
చిన్నారి

చాలా రోజులగా నుంచి ఈ తంతును గమనిస్తున్న ఇరుగుపొరుగు వారు.. శుక్రవారం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిందితులైన డాక్టర్ వలియుల్ ఇస్లాం, డాక్టర్ సంగీత దత్తలను అదుపులోకి తీసుకున్నారు. వలియుల్ ఇస్లాం పల్టన్ బజార్ పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లారు. రాత్రి సమయం కావడం వల్ల సంగీతను ఇంట్లోనో నిర్బంధించారు.

వైద్యులు

అయితే పోలీస్​ స్టేషన్​లో నిందితుడు వలియుల్ ఇస్లాం.. ఒకేసారి పది మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అతడ్ని గువాహటి మెడికల్​ కాలేజ్​ ఆసుపత్రికి తరలించినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం అతడు సురక్షితంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. చిన్నారిని కూడా పోలీసులు అదపులోకి తీసుకుని.. శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. బాలిక శరీరంపై గాయాలు ఉన్నాయని వారు వివరించారు. వైద్యులు అమానుష ఘటనపై సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు. నిందితులు చిన్నారిని చట్టవిరుద్ధంగా దత్తత తీసుకోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.