Bank Employee Transfer Money to Family Member : ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఖాతాల నుంచి అక్రమంగా నగదును ట్రాన్స్ఫర్ చేశాడు ఓ బ్యాంక్ ఉద్యోగి. తన తల్లి, భార్య ఖాతాలకు సుమారు రూ.28.07 కోట్ల నగదును బదిలీ చేశాడు. ఈ ఘటన దిల్లీలోని సెక్టార్ 22 సౌత్ ఇండియన్ బ్యాంక్ శాఖలో జరిగింది. దీంతో అసిస్టెంట్ మేనేజర్ రాహుల్ శర్మ సహా అతడి తల్లి, భార్య, పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ జరిగింది
హరియాణా రోహ్తక్కు చెందిన రాహుల్ శర్మ దిల్లీ నొయిడాలోని సెక్టార్ 27లో ఉంటూ, సెక్టార్ 22లోని సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, సెక్టార్ 48లో ఉన్న అసోసియేట్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఖాతాల నుంచి సుమారు 20 సార్లు నగదును అక్రమంగా బదిలీ చేశాడు. తల్లి సీమా శర్మ, భార్య భూమిక శర్మ సహా పలువురి పేరిట ఖాతాలు తెరిచి రూ.28.07 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. దీనిని గమనించిన ప్రైవేట్ సంస్థ- బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 3, 4, 6 తేదీల్లో తమ అనుమతి లేకుండా అక్రమంగా నగదు ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్‌కు తెలిపింది.
ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన బ్యాంక్ విజిలెన్స్ అధికారులు అక్రమ నగదు బదిలీ జరిగినట్లు గుర్తించారు. దీంతో దిల్లీ రీజనల్ మేనేజర్ సెక్టార్ 24 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద రాహుల్ శర్మ సహా అతడి తల్లి, భార్య, పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నగదు బదిలీ జరిగిన ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని విచారిస్తామని పోలీసులు చెప్పారు.
బ్యాంకు మేనేజర్ చేతివాటం- బంధువుల అకౌంట్లలోకి రూ.3 కోట్లు
Gopalganj Co Operative Bank Manager Fraud : పని చేస్తున్న బ్యాంకుకే టోకరా వేశాడు బిహార్‌లోని గోపాల్‌గంజ్ సెంట్రల్ కో- ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్. ఖాతాదారుల అకౌంట్ల నుంచి సుమారు రూ.3 కోట్లు తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. దీంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయంలో మేనేజర్‌కు సహకరించిన మరో ఇద్దరిపైనా వేటు వేశారు. ఇప్పటి వరకు సుమారు రూ. 85 లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మస్తాన్‌వలీ ముంచేశాడుగా! - ₹ 58 లక్షలు ఖాతాలో వేసుకున్న బ్యాంక్ క్యాషియర్
SBI Bank Employee Fraud : బ్యాంక్ ఉద్యోగే.. దొంగయ్యాడు.. ఖాతాలో రూ.14 లక్షలు మాయం