కర్ణాటకలో పోలీసుల అదుపులో ఉన్న ఓ నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమంత నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని భావిస్తున్నారు అక్కడి పోలీసులు.
పలువురిని మోసం చేసి అక్రమంగా భూమి కాజేయాలని చూసిన సిద్ధలింగ స్వామిని ఫిబ్రవరి 24న అరెస్టు చేశారు పోలీసులు. అతడి వద్ద ఉన్న ఆధారాలు సేకరించడానికి విద్యారణ్యపురలోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో భార్య, పిల్లలను చూసిన స్వామి.. సిగ్గుతో చలించిపోయాడు. నీళ్లు తాగి వస్తా అని రెండో అంతస్తులో ఉన్న కిచెన్లోకి వెళ్లి.. అక్కడి నుంచి దూకి చనిపోయాడు.
ఇదీ చూడండి: దత్తత తీసుకున్న యువకుడి పెళ్లికి రాజ్నాథ్ హాజరు