ETV Bharat / bharat

పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్​- నైజీరియన్​ అరెస్ట్ - కర్ణాటకలో డ్రగ్స్​ కలకలం

Bangalore Drugs News: మిల్క్​పౌడర్​ ప్యాకెట్ల ద్వారా డ్రగ్స్​ పంపిణీ చేస్తున్న ఓ నైజీరియన్​ను అరెస్ట్​ చేశారు బెంగళూరు పోలీసులు. మరోవైపు గంజాయి విక్రయిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 8కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Bangalore Drugs News
పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్​-నైజీరియన్​ అరెస్ట్
author img

By

Published : Dec 16, 2021, 4:43 PM IST

Bangalore Drugs News: పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్​ తరలించేందుకు యత్నించిన ఓ నైజీరియన్​ను అరెస్ట్​ చేశారు బెంగళూరు పోలీసులు. నిందితుడు నైజీరియాకు చెందిన థామస్​ కౌల్​గా గుర్తించిన పోలీసులు.. అతడి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 260 డ్రగ్​ పిల్స్​, 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రముఖ సంస్థకు చెందిన పాలపొడి ప్యాకెట్లలో నిందితుడు గంజాయిని సరఫరా చేస్తున్నాడని అధికారులు వెల్లడించారు.

Bangalore Drugs News
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​

థామస్​ ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు అంజుమ్​ జంగ్​ అనే మహిళకు నోటీసులు పంపారు. ప్రెస్టీజ్​ గ్రూప్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంజుమ్​.. నిందితుడు వద్ద నుంచి డ్రగ్స్​ కొనుగోలు చేసేదని పోలీసులు తెలిపారు.

8 కిలోల గంజాయి సీజ్​..

అన్నపూర్ణేశ్వరీ ఠాణా​ పరిధిలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కాలేజీ విద్యార్థులకు నిందితులు గంజాయిని పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి : యూపీలో మోదీ సుడిగాలి పర్యటనలు- 10 రోజుల్లో నాలుగు టూర్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.