ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది యువకులను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత నగలు, నగదుతో ఉడాయించిన భాగ్‌వతి అలియాస్ అంజలి అనే యువతిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి ఆంధ్రప్రదేశ్‌లోని రాయ్చోటి మండలం కోల్పేట గ్రామానికి చెందినట్లు గుర్తించారు. ఆమెతో పాటు మరో ఐదుగురినీ జునాగఢ్‌లో పట్టుకున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ముఠా పలువురిని మోసగించినట్లు పోలీసులు చెబుతున్నారు. జునాగఢ్‌కు చెందిన యువకుడి ఫిర్యాదుతో వల పన్నగా.. వీరు పట్టుబడ్డారు. మారుపేరు, నకిలీ పత్రాలతో ఆమె గుజరాత్‌లో ఉంటున్నట్లు విచారణలో తేలింది.
![Bandit bride arrested from Junagadh belonged to Andhra Pradesh who was living in Gujarat under an assumed name](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-dulhan-vis-01-byte-01-pkg-7200745_20032021144546_2003f_1616231746_88_2003newsroom_1616252664_422.jpg)
వారి పని ఇదే..
యువకులను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వారివద్ద ఉన్న నగలు, నగదుతో పారిపోవడం వీరి పని. జునాగఢ్ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడి, ఇలాగే నగలతో పాటు రూ.3 లక్షల మేర నగదుతో ఆమె పారిపోయింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల మోసమంతా వెలుగులోకి వచ్చింది. నిందితులు గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసిన పోలీసులు.. వలపన్ని పట్టుకున్నారు. అంజలి, ఆమె తల్లి ధనుబెన్‌లను పోలీసులు అరెస్టుచేసి విచారించగా 18 మంది యువకులు వీరి చేతిలో మోసపోయినట్లు తెలిసింది.
![Bandit bride arrested from Junagadh belonged to Andhra Pradesh who was living in Gujarat under an assumed name](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-dulhan-vis-01-byte-01-pkg-7200745_20032021144546_2003f_1616231746_1103_2003newsroom_1616252664_626.jpg)
ఇదీ చూడండి: బాలికపై గ్యాంగ్ రేప్- దోషులకు 20 ఏళ్ల జైలు