ETV Bharat / bharat

ఎన్నికల ర్యాలీలపై నేడు ఈసీ కీలక భేటీ - ఎన్నికల ప్రచారం

Election Commission: ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం ర్యాలీలు, రోడ్​షోలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధం కొనసాగింపుపై శనివారం కీలక నిర్ణయం తీసుకోనుంది భారత ఎన్నికల సంఘం.

up election 2022
election commission
author img

By

Published : Jan 15, 2022, 6:50 AM IST

Election Commission: ఎన్నికల ర్యాలీలపై శనివారం కీలక సమావేశం నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. యూపీ సహా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో భౌతిక ప్రచార ర్యాలీలు, రోడ్​షోలపై జనవరి 15 వరకు అమల్లో ఉన్న నిషేధాన్ని పొడిగించాలా వద్దా అనే అంశంపై చర్చించనుంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వీటిపై జనవరి 8న నిషేధం విధించింది ఈసీ. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి శనివారం ఓ నిర్ణయం తీసుకోనుంది.

ఒమిక్రాన్​ ప్రభావంతో ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోని జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలకు కేటాయించిన బ్రాడ్​కాస్ట్​ సమయాన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు శుక్రవారం ఈసీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్​, గోవా, పంజాబ్​, మణిపుర్​లో ఫిబ్రవరి 10 నుంచి 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.