ETV Bharat / bharat

Balakrishna Speech in Birthday Celebrations : 'ప్రతి మనిషి.. దేశానికి ఉపయోగపడే పౌరుడిగా ఉండాలని కోరుకుంటున్నా' - బాలకృష్ణ తాజా వార్తలు

Balakrishna Birthday Celebrations in Hyderabad : మన ఆలోచనలకు.. మన శరీరాన్ని బానిసగా చేసుకుంటే వయసుతో సంబంధం లేకుండా సమాజానికి సేవ చేయొచ్చని నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లోని బసవ తారకం ఆస్పత్రిలో బాలకృష్ణ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ఛైర్మన్‌గా ఉండటం.. తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.

Balakrishna
Balakrishna
author img

By

Published : Jun 10, 2023, 2:16 PM IST

బసవతారకం ఆస్పత్రికి ఛైర్మన్‌గా ఉండటం పూర్వజన్మ సుకృతం: బాలకృష్ణ

Balakrishna Birthday Celebrations at Basavatarakam Cancer Hospital : ప్రతి ఒక్క మనిషి దేశానికి ఉపయోగపడే పౌరుడిగా ఉండాలని కోరుకుంటున్నానని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. మన ఆలోచనలకు.. మన శరీరాన్ని బానిసగా చేసుకుంటే.. వయసుతో సంబంధం లేకుండా సమాజానికి సేవ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బసవ తారకం ఆస్పత్రిలో బాలకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. కేక్‌ కట్​ చేసి.. చిన్నారులకు కానుకలను పంపిణీ చేశారు.

Balakrishna Speech at Basavatarakam Cancer Hospital : ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ఛైర్మన్‌గా ఉండటం... తన పూర్వజన్మ సుకృతమని బాలకృష్ణ చెప్పారు. ఆస్పత్రి నుంచి ఒక రోగి డిశ్చార్జ్ అయ్యి వెళ్తుంటే.. తనకు పండగలా ఉంటుందని వ్యాఖ్యానించారు. పేదల కోసమే తన తండ్రి ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను ప్రారంభించారన్నారు. ఈ ఆస్పత్రి ఏ ఉద్దేశంతో అయితే స్థాపించామో అది నెరవేర్చేందుకు ఇక్కడి స్టాఫ్... ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారన్నారు.

దేశంలో రెండో గొప్ప ఆస్పత్రిగా.. బసవతారకం ఆసుపత్రిని గుర్తించడం చాలా ఆనందంగా ఉందని నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. నటుడు, ఆస్పత్రికి ఛైర్మన్, ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉండాలో నాన్నను చూసి చాలా నేర్చుకున్నానని అన్నారు. తన తండ్రి, చంద్రబాబు నాయుడు గారిలా ముందుచూపుతో ఉండాలన్నారు. నిస్వార్థంగా పని చేద్దామన్న బాలకృష్ణ.. ఇకముందు కూడా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

'బసవతారకం ఆస్పత్రికి ఛైర్మన్‌గా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. ఆ‌స్పత్రి నుంచి రోగులు డిశ్చార్జ్‌ అయి వెళ్తుంటే నాకు పండగే. దేశంలో రెండో గొప్ప అస్పత్రిగా గుర్తించడం ఆనందంగా ఉంది. మన ఆలోచనలకు బానిసగా మన శరీరాన్ని చేసుకోవాలి. నా పుట్టినరోజున కౌంట్ డౌన్‌గా పెట్టుకుంటాను. ఎప్పుడూ నా వయస్సుని తిరగేస్తాను. 36లాగా ఫీల్ అవుతాను. ఆస్పత్రిలో అందరూ ఆ విధంగానే పని చేస్తున్నారు. నా వరకు నాకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం పైనే దృష్టి పెడతాను. దేశం, సమాజానికి మనం ఏమిచ్చామనే విధంగా ఉండాలి.'-బాలకృష్ణ, ప్రముఖ సినీ నటుడు

భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ : అంతకుముందు బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న 108వ చిత్రం భగవంత్ కేసరి టీజర్​ను ఆ చిత్రబృందం విడుదల చేసింది.​ కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్లో వందలాది మంది నందమూరి అభిమానుల సమక్షంలో భగవంత్ కేసరి టీజర్​ను విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రిన్ పతాకంపై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున 'నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటందంటూ' బాలకృష్ణ సరికొత్త ఆహార్యంలో కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. అనంతరం చిత్రబృందం అభిమానుల మధ్య కేక్ కట్ చేసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.