ETV Bharat / bharat

విరాళంగా రూ.కోట్ల ఆస్తి.. కుటుంబంతో కలిసి 'ప్రపంచానికి' దూరంగా..! - balaghat jewellery trader news

Balaghat jewellery trader: రూ.కోట్లు విలువ చేసే యావదాస్తిని విరాళంగా రాసిచ్చారు ఓ వ్యాపారి. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 22న జైపుర్​లో దీక్ష స్వీకరించనున్నారు.

surana_parivar
రూ.కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చిన వ్యాపారవేత్త
author img

By

Published : May 18, 2022, 11:37 AM IST

Updated : May 18, 2022, 12:42 PM IST

విరాళంగా రూ.కోట్ల ఆస్తి.. కుటుంబంతో కలిసి 'ప్రపంచానికి' దూరంగా..!

Rakesh Surana: కోటీశ్వరులు తమ యావదాస్తిని దానం చేసి నిరాడంబర జీవితం గడిపే సన్నివేశాలను సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్ బాలాఘాట్​లో ఇలాంటి ఘటన నిజంగా జరిగింది. ప్రముఖ ఆభరణాల వ్యాపారి రాకేశ్​ సురానా రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు వీటిని రాసిచ్చారు. అంతేకాదు విలాసవంతమై జీవితాన్ని వీడి తన భార్య లీనా సురానా(36), కుమారుడు అమయ్ సురానా(11)తో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు.

గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రాకేశ్​ సురానా. ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

surana_parivar
రూ.కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చిన వ్యాపారవేత్త

" డబ్బు సంపాదించి సుఖంగా ఉండటమే జీవితం కాదు. మనమేంటి అని గుర్తించడమే జీవితం పరమార్థం. మానవుల కోరికలకు ఎప్పటికీ అంతం ఉండదు. మతం, ఆధ్యాత్మికత విలువల గురించి గురు మహేంద్ర సాగర్ మహరాజ్​, మనీశ్ సాగర్​తో గడిపినప్పుడు తెలుసుకున్నా. నా భార్య కూడా చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనుకుంది. నా కుమారుడు కూడా నాలుగేళ్ల నుంచే ఇదే మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నాడు. "

-రాకేశ్​ సురానా, వ్యాపారవేత్త

బాలాఘాట్​లో చిన్న దుకాణంతో రాకేశ్ సురానా ప్రస్థానం మొదలైంది. నిరంతరం శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారు. డబ్బుతో పాటు స్థానికంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సకల సదుపాయాలతో విలాసవంతంగా జీవిస్తున్న ఆయన.. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు.

రాకేశ్ సతీమణి లీనా సురానా మొదట అమెరికాలో చదువుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు యూనివర్సిటీలో పై చదువులు పూర్తి చేశారు. 2017లో ఆమె తల్లి దీక్ష తీసుకున్నారు. కానీ క్యాన్సర్ వల్ల ఆ తర్వాత ఏడు రోజులకే ఆమె చనిపోయారు. లీనా సోదరి నేహ కూడా 2008లోనే దీక్ష చేపట్టారు. ఇప్పుడు ఈ కుటుంబం మొత్తం మే 22న జైపుర్​లో దీక్ష స్వీకరించనుంది.

ఇదీ చదవండి: తాగొచ్చి రచ్చ చేసిన వరుడు.. పెళ్లి కుమారుడ్నే మార్చేసిన వధువు తండ్రి

Last Updated : May 18, 2022, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.