ETV Bharat / bharat

'బజరంగ్​ దళ్​ నిషేధంపై వెనక్కి తగ్గేదే లే.. ఛత్తీస్​గఢ్​లో కూడా..' - కాంగ్రెస్ మేనిఫెస్టో కర్ణాటక బజరంగ్ దళ్

కర్ణాటక రాష్ట్రంలో బజరంగ్​ దళ్​ నిషేదంపై డీకే శివకుమార్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల మానిఫెస్టో నుంచి ఆ హామీని తొలగించే పసక్తేలేదని స్పష్టం చేశారు. బజరంగ్​ దళ్​ నిషేదం అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. ప్రధానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

bajrang-dal-controversy-in-karnataka-d-k-shivakumar-comments-on-bajrang-dal
భజరంగ్ దళ్ పై డీకే శివకుమార్ వ్యాఖ్యలు
author img

By

Published : May 3, 2023, 11:05 PM IST

బజరంగ్​ దళ్​పై నిషేదం అంశాన్ని ఎన్నికల మానిఫెస్టో నుంచి తొలగించే పసక్తేలేదని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేసినా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని తేల్చి చెప్పారు. గురువారం బెంగళూరులోని ఓ హోటల్​ ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. బజరంగ్​ దళ్​కు, ఆంజనేయ స్వామికి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాను కూడా రాముడు, ఆంజనేయ స్వామి, శివుడికి భక్తుడేనంటూ వివరించారు. రోజు హనుమాన్ చాలీసా పఠిస్తానని శివకుమార్ తెలిపారు.

"బీజేపీ వారు మాత్రమే భక్తులు కాదు. మేమూ భక్తులమే. బజరంగ్ దళ్​ను బ్యాన్ చేస్తే బీజేపీకి ఎందుకంత భయం? బజరంగ్​ దళ్​ విషయంలో బీజేపీ రెచ్చగొట్టే పనులు చేస్తోంది. కర్ణాటక ప్రజలు దీనిని క్రమంగా అర్థం చేసుకుంటారు. ఆంజనేయ స్వామి, బజరంగ్​ దళ్​.. రెండూ వేర్వేరు. మేం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం. బీజేపీ మా మేనిఫెస్టోలో ఒక అంశాన్ని తీసుకుని డ్రామాలు చేస్తోంది. ఇవేవీ పనిచేయవు. బీజేపీ ఏం చేసినా.. మాకు కచ్చితంగా 141 సీట్లు వస్తాయి."
- డీ.కే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు.

దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో చేపట్టబోయే 37 కిలోమీటర్ల రోడ్​షోపై మాట్లాడిన శివకుమార్​.. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. 37 కిలోమీటర్లకు కాకపోతే 370 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకోవచ్చని మోదీని ఉద్దేశిస్తూ శివకుమార్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు కూడా అవకాశం ఇస్తే.. తాము ర్యాలీ చేస్తామని శివకుమార్​ వివరించారు.

పార్టీల ర్యాలీలు, ఖర్చులపై ఎలక్షన్​ కమిషన్​ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని శివకుమార్​ ఆరోపించారు. హెలికాప్టర్​ ల్యాండింగ్​ విషయంలోనూ ఎలక్షన్ కమిషన్ అలాగే వ్యవహరించిందన్నారు. మేము కూడా అదే తరహాలో ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మే 7న బెంగళూరులో రాహుల్​ గాంధీ ర్యాలీ చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు.

కాంగ్రెస్​పై మోదీ చేసిన ఏటీఎమ్ వ్యాఖ్యలపైనా శివకుమార్​ మాట్లాడారు. ప్రధానికి తమను విమర్శించకూడదన్న శివకుమార్​.. డబుల్​ ఇంజి​న్​ సర్కార్​ వృద్ధి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందని మోదీని నిలదీశారు. రాష్ట్రంలో ఉద్యోగాల సృష్టే తమ లక్ష్యమని శివకుమార్​ తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజల ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న హామీ ఏమైందన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేదని విమర్శించారు. 40 కమీషన్​ తీసుకున్న మంత్రులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

భజరంగ్‌ దళ్​ను మేమూ నిషేధిస్తాం: భూపేశ్ బఘేల్
భజరంగ్‌ బలి పేరుతో గూండాయిజం చేస్తున్నారని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో కూడా భజరంగ్ దళ్ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించిదన్నారు. దానిని మేము సరిదిద్దామని ఆయన వివరించారు. ఛత్తీస్​గఢ్​లో నిషేధించాల్సిన అవసరం వస్తే.. ఆలోచిస్తామని భూపేశ్ బఘేల్ తెలిపారు. హనుమంతుడు తమ ఆరాధ్యదైవమని ఆయన స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.