ETV Bharat / bharat

కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ భాగ్​పత్​లో విషాద ఘటన జరిగింది. కారులో ఆడుకుంటున్న నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారిని పోలీసులు కాపాడారు.

children died due to suffocation in car
కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి
author img

By

Published : May 7, 2021, 7:35 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ భాగ్​పత్ జిల్లా చాందీనగర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని సింగోలి తాంగ్ గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఓ కూడలిలో పార్క్​ చేసి ఉన్న కారులో ఆటలాడుకుంటున్న నలుగురు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. మరో చిన్నారిని పోలీసులు కాపాడి ఆస్పత్రికి తరలించారు.

పిల్లలు కారులో ఆడుకునే సమయంలో పొరపాటున లాక్ పడి ఈ ప్రమాదం జరిగింది. డోర్లు తెరచుకోకపోవడం వల్ల శ్వాస ఆడక వారు మరణించారు. ఆస్పత్రికి తరలించిన మరో చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

children died due to suffocation in car
కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్థులు వారిని చూసి చలించిపోయారు.

ఘటనలో చనిపోయిన చిన్నారులను దీప(8), వందన(4), అక్షయ్​(4), కృష్ణ(7)గా గుర్తించారు. ఎనిమిదేళ్ల శివన్​ను పోలీసులు కాపాడారు.

ఇదీ చూడండి: కొవిడ్‌ విజేతలపై 'బ్లాక్‌ ఫంగస్‌' పంజా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.