ETV Bharat / bharat

Bachpan Ka Pyar Boy: 'బచ్‌పన్‌ కా ప్యార్‌' బాలుడికి తీవ్రగాయాలు - బచ్​పన్ కా ప్యార్ వైరల్ పాట

Bachpan ka pyar boy accident: 'బచ్​పన్​ కా ప్యార్' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలుడు సహ్​దేవ్ దిర్దో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడటం వల్ల ప్రమాదం జరిగింది. బాలుడికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.

Bachpan ka pyar boy accident
Bachpan ka pyar boy accident
author img

By

Published : Dec 29, 2021, 6:41 AM IST

Bachpan ka pyar boy accident: 'బచ్‌పన్‌ కా ప్యార్‌' పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుపరిచితమైన బాలుడు సహ్‌దేవ్‌ దిర్దో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం సాయంత్రం సహ్‌దేవ్‌ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి కిందపడటంతో సహ్‌దేవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాన్ని నడపుతున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.

Bachpan ka pyar boy accident
బాలుడిని అంబులెన్సులోకి ఎక్కిస్తున్న సిబ్బంది

Sahadev dirdo bike accident

సహ్‌దేవ్‌ను తొలుత సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జగ్‌దల్‌పూర్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ వినీత్‌ నందన్‌వర్‌, ఎస్పీ సునీల్‌ శర్మ సహ్‌దేవ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సహ్‌దేవ్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ అధికారులను ఆదేశించారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కీలకమైన ప్రాంతంగా పేరొందిన సుక్మా జిల్లాకు చెందిన సహ్‌దేవ్‌.. 2019లో తరగతి గదిలో 'బచ్‌పన్‌ కా ప్యార్‌' పాట పాడాడు. దీన్ని ఆ స్కూల్‌ టీచర్‌ వీడియో తీశాడు. కొన్ని రోజుల క్రితం ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. పలువురు ప్రముఖులు సహ్‌దేవ్‌ను ప్రశంసించారు. ఆ పాటను అనుకరిస్తూ పలువురు వీడియోలు కూడా చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ సైతం బాలుడి ప్రతిభకు ఫిదా అయ్యారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: మలేసియాలో చిక్కుకున్న యువకుడు.. భావోద్వేగంతో లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.