ETV Bharat / bharat

పెళ్లి కాలేదని వెళితే.. తల్లీకూతుళ్లపై రెండేళ్లుగా బాబా అత్యాచారం! - మహారాష్ట్ర బాబా అత్యాచారం

Baba Rape Case: తల్లితో పాటు ఆమె ముగ్గురు కూమార్తెలపై రెండేళ్లగా ఓ బాబా అత్యాచారానికి పాల్పడుతున్న దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి బాబా సహా అతడి సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Baba rape case
Baba rape case
author img

By

Published : Feb 24, 2022, 8:45 PM IST

Baba Rape Case: పెళ్లి కావట్లేదు.. పరిహారం చూపాలంటూ ఆశ్రయించినందుకు తల్లితో పాటు ఆమె ముగ్గురు కుమార్తెలపై రెండేళ్లుగా ఓ దొంగ బాబా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో బాబాతో పాటు అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది

బాధితురాలు తన కుమార్తెకు పెళ్లి కావటం లేదని.. యోలా తాలూకాలోని నాగ్డే గ్రామంలో బాబా వద్దకు వెళ్లింది. యువతిపై చేతబడి జరిగిందని చెప్పిన బాబా.. తల్లితో సహా ముగ్గురు యువతులకు మత్తుమందు కలిపిన నీళ్లు తాగించాడు. అనంతరం సోదరుడితో కలిసి వారిపై అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేస్తానని బెదిరించి.. సుమారు రెండున్నరేళ్లుగా తరచూ తల్లితో పాటు ఆమె కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అంతేకాకుండా ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బులు కూడా డిమాండ్​ చేసేవాడు.

బాబా ఆగడాలు తట్టుకోలేని బాధితురాళ్లు.. ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించటం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. వారిని సూఫీ అజీజ్ అబ్దుల్ బాబా, జబ్బర్​ షేక్​లుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కూతురికి మూడు పెళ్లిళ్లు.. రూ.200 కోసం తల్లి నిర్వాకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.