ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: వెక్కిరించిన వ్యక్తే.. ఉక్కు మనిషయ్యారు!

Azadi Ka Amrit Mahotsav: అచ్చం ఆంగ్లేయుల్లా తయారై.. ఆ కాలంలోనే నెలకు రూ.10వేలు ఆర్జిస్తూ.. సాయంత్రమైందంటే క్లబ్‌లో బ్రిడ్జ్‌ ఆడుతూ.. సత్యాగ్రహాన్ని చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ స్వాతంత్య్ర సమరం పనిలేని వాళ్ల పని అనుకుంటూ విలాస జీవితం గడిపిన వ్యక్తి.. గాంధీజీకి కుడి భుజమవుతారని.. సత్యాగ్రహాలను దగ్గరుండి నడిపిస్తారని..స్వాతంత్య్రానంతరం దేశాన్ని నిలబెడతారని.. ఉక్కు మనిషిగా నిలిచిపోతారని ఎవరనుకుంటారు? అలా అనుకోని మలుపులతో దేశానికి అంకితమైన జీవితమే సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ది!

sardar vallabhbhai patel history
సర్దార్ వల్లభ్​బాయ్ పటేల్​
author img

By

Published : Dec 15, 2021, 6:45 AM IST

Azadi Ka Amrit Mahotsav: గుజరాత్‌లోని కుగ్రామం నదియాద్‌లో 1875 అక్టోబరు 31న జన్మించారు వల్లభ్‌భాయ్‌. తండ్రి పేద రైతు. చిన్నప్పటి నుంచే ధైర్యం, నాయకత్వం, అన్యాయంపై పోరాటం, సహచరులకు సాయం.. ఆయనలో స్పష్టంగా కన్పించేవి. దగ్గర్లోని పేట్లాడ్‌లో హైస్కూల్‌ చేరిన ఆయన.. రైల్‌ టికెట్‌కు డబ్బుల్లేక.. వారంవారం నడుచుకుంటూ ఇంటికి వచ్చి సామగ్రి తీసుకొని వెళ్లి వండుకొని తినేవారు. స్కూల్లోని ఓ ఉపాధ్యాయుడే పిల్లలకు పుస్తకాలు అమ్మేవారు. ఆయన దగ్గర కొనని వారిని వేధించేవారు. నిరసనగా సహచరులందరితో కలసి పటేల్‌ క్లాసులకు దూరంగా ఉన్నారు. వారంపాటు స్కూల్‌ మూతబడింది. పుస్తకాలమ్మే టీచర్‌ తన తీరు మార్చుకోవాల్సి వచ్చింది. కానీ ఈ నాయకత్వ వైఖరే ఆయన్ను స్కూల్‌కు దూరం చేసింది. ఇంటి నుంచే పరీక్షలు రాసిన పటేల్‌ 22వ ఏట ఎస్సెస్సీ పాసయ్యారు.

Sardar Vallabhbhai Patel Study:

బారిస్టర్‌ కావాలన్నది ఆయన కల. అంటే ఇంగ్లాండ్‌ వెళ్లి చదవాలి. కానీ ఇక్కడే కాలేజీలో చేరటానికి డబ్బుల్లేని పరిస్థితి. ఆ కాలంలో ఇంట్లోంచే చదివి లా పరీక్ష కట్టడానికి అవకాశం ఉండేది. దీంతో తెలిసిన లాయర్‌ దగ్గర తీర్పుప్రతులు, పుస్తకాలు తెచ్చుకొని, అప్పుడప్పుడు కోర్టుకు వెళ్లి వాదనలను పరిశీలించి.. పరీక్ష రాసి లా పూర్తిచేశారు పటేల్‌. మిత్రుల ఆర్థిక సాయంతో గోద్రాలో లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలెట్టి.. అచిరకాలంలోనే పేరు సంపాదించారు. ఇంతలో పెళ్లయింది. కుమార్తె, కొడుకు పుట్టిన తర్వాత భార్యను క్యాన్సర్‌ చికిత్స కోసం ముంబయిలోని ఆసుపత్రిలో చేర్చారు. ఇంగ్లాండ్‌లో బారిస్టర్‌ పూర్తిచేసేందుకు అవకాశం వచ్చింది. కానీ తన సోదరుడి కోసం ఆ అవకాశాన్ని వదులుకొన్నారు.

Sardar Vallabhbhai Patel Childwood:

ఓ రోజు కోర్టులో తీవ్ర వాదనలు నడుస్తున్నాయి. పటేల్‌కు లాయర్‌గా కీలకమైన కేసు అది. వాదనల మధ్య ఓ టెలిగ్రాం తెచ్చి ఇచ్చారాయనకు. చదివి జేబులో పెట్టుకుని వాదనలు కొనసాగించారు. కేసు గెలిచారు. వాదనలు పూర్తయ్యాక టెలిగ్రాం సందేశం.. భార్య చనిపోయారన్న విషయం బయటపడింది. బాధ్యతల నిర్వహణలో ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకునే నేర్పు ఆయన సొంతం. 33 ఏళ్ల వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయిన పటేల్‌ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన సోదరుడు భారత్‌కు తిరిగి వచ్చాక.. ఇంగ్లాండ్‌కు వెళ్లిన ఆయన 36 నెలల కోర్సును 30 నెలల్లోనే పూర్తి చేశారు. 36 ఏళ్ల వయసులో బారిస్టర్‌ పరీక్షలో క్లాస్‌లో ప్రథమశ్రేణిలో పాసై వచ్చారు. అహ్మదాబాద్‌లో పేరున్న న్యాయవాదిగా మారి.. ఆ కాలంలోనే నెలకు 10వేల రూపాయలు సంపాదించేవారు. ఇంగ్లిష్‌ దొరలా సూటూబూటూ వేసుకొనేవారు. పిల్లల్నీ అలాగే పెంచసాగారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ సాయంత్రమైందంటే క్లబ్‌కు వెళ్లి బ్రిడ్జి ఆడటం, కుటుంబాన్ని చూసుకోవటం.. ఇదే పని. సత్యాగ్రహం, స్వాతంత్య్ర ఉద్యమం, దేశసేవలను నవ్వులాటగా కొట్టిపారేసేవారు.

గాంధీని కలిశాక..

Sardar Vallabhbhai Patel Role In Independence: కానీ 1917లో గోద్రాలో జరిగిన ఓ సదస్సులో గాంధీజీని కలవటంతో ఆయన జీవితమే మారిపోయింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. గాంధీ నిజాయితీకి, పట్టుదలకు ఫిదా అయిన పటేల్‌ ఆయన బాట పట్టారు. వస్త్రధారణలో, ఆలోచనల్లో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఖేడా నుంచి మొదలెడితే బర్దోలి, నాగ్‌పుర్‌లాంటి చోట్ల అనేక సత్యాగ్రహాలను.. ప్రజలను భాగస్వాములను చేస్తూ దగ్గరుండి విజయవంతంగా నడిపించారు. గుజరాత్‌ విద్యాపీఠాన్ని నెలకొల్పి పాఠశాలు తెరిచారు. 1924లో అహ్మదాబాద్‌ మేయర్‌గా ఎన్నికయ్యాక.. రోజూ పొద్దున్నే పట్టణంలో మార్నింగ్‌ వాక్‌ చేసేవారు. స్వయంగా రోడ్లు ఊడ్చేవారు. మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికకాకుండా అప్పట్లో ఓ చట్టం ఉండేది. దాన్ని రద్దు చేసేదాకా పోరాడారు పటేల్‌.

"పటేల్‌ లేకుంటే జాతీయోద్యంలో ఇన్ని జరిగేవి కావు" అంటూ గాంధీజీ కితాబిచ్చారంటే ఆయన పాత్రను అర్థం చేసుకోవచ్చు. ఉక్కు మనిషిగా పేరొందినా.. ప్రజల కోసం వెన్నలాంటి మనసున్న సర్దార్‌ పటేల్‌- తన మార్గదర్శి గాంధీజీ మరణించిన రెండేళ్ళకు.. 1950 డిసెంబరు 15న ముంబయిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

ఇదీ చదవండి:''ఒకే జిల్లా- ఒకే ఉత్పత్తి'తోనే ఆత్మనిర్భరత'

విజయానికి 50 వసంతాలు- నేడు బంగ్లాదేశ్​కు రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.